పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 203

శా. జీమూతాళికురంగనాభిశశభృచ్చిహ్నామరేంద్రోపల[1]
వ్యోదీవమేంఠసామజాతయమునాహోమాగ్నిధూమాంజన
శ్యామాకారుసమస్తకల్మషతమస్సందోహమార్తాండు ను
ద్ధామానంతయశోభిరాముని రమాధామున్ గుణస్తోమునిన్. 286

జా. సర్పాధీశ్వరకుందచందనపయశ్చంద్రాబ్జమందాకినీ
కర్పూరామృతహారహీరతుహనాకారానుకారాకృతిన్
దర్ఫారూఢపికద్విరేఫశుకబృందారోహకోత్సాహకం
దర్పాటోపవనాంతదావదహనుం ద్రైలోక్యరక్షామణిన్. 287

మాలిని. వివిధసురవరేణ్యా వేదవేదాంతగణ్యా
భవతిమిరదినేంద్రా భక్తకారుణ్యసాంద్రా
సవినయజయలోలా సర్వలోకానుపాలా[2]
భవమధురిపురూపా భవ్యదివ్యస్వరూపా[3]. 288

గద్యము. ఇది రాయగజగంధవారణ వైరిమండలికభేకఫణీంద్ర వీరఘోట్టవిభాళాది బిరుదప్రకటచారిత్ర కళింగదేశనిర్దూమధామ త్యాగనాగార్జున కర్ణాటద్రవిళాంధ్రమహారాష్ట్రభూపాలరూపనూపురసుందరచరణారవింద సనదప్రోలిపురవరాధ్వీశ్వర వెలనాఁటిపృథ్వీశ్వరరాజ్యసముద్ధరణ శ్రీకొఱవీ
వెన్నయామాత్యపుత్ర హరితసగోత్రపవిత్ర సకలసుకవిమిత్ర కసవరాజతనూజ గోపరాజవిరచితంబైన సింహాసనద్వాత్రింశిక యను కావ్యంబునందు
రత్నోద్భవుకథయును మూషకోపాఖ్యానంబును విక్రమార్కుని సాహసికత్వమహౌ దార్యత్వంబులును గమలాకరుకథయునన్నది చతుర్థాశ్వాసము.

  1. శీతిభృచ్ఛ్రీశ్యామలేంద్రోపల
  2. సర్వలోకానుకూలా
  3. భవతు దివిజరక్షా పద్మపత్రాయతేక్షా