పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

174 సింహాసన ద్వాత్రింశిక

బ్రాణిపరిపాలనమునకుఁ
బ్రాణము వంచింపనేల పరహితమతికిన్. 141

క. తనతనయులుఁ దనసతులును
దనవారలుఁ దనగృహంబుఁ దనసొమ్మనుచుం
దనుపున దనరెడికప్పలఁ
దన దగు తను విచ్చి కాచి తనిపెదఁ బ్రీతిన్. 142

క. ఈగతి “ధర్మస్య త్వరి
తాగతి" యనుపలుకుకొలఁది దడయక నే నా
నాగేంద్రుని కెదిరించెద
నాగాంతకుఁ జేరుఖచరనందను మాడ్కిన్. 143

క. అని పలికి శంఖపాలుని
పని విఘ్నముఁ బొందఁజేయఁ బనిపూని గజా
ననుఁడు దనవాజిఁ బుత్తెం
చెనొ యనఁగా మూషకంబు క్షితిపై నుఱికెన్. 144

సీ. ధవళాంశు మ్రింగి సుధాశక్తిఁ దెల్లని
దేహంబు వడసిన రాహు వనఁగ
భువనత్రయం బొకబుట్టఁ[1] బెట్టఁగఁ జాలు
వేఁడిమిపడగలు మూఁడు మెఱయ
భీషణం బై యున్న రోషాగ్నిఁ బొడమెడు
శిఖలకైవడిఁ గ్రాలు జిహ్వ లడర
దనలోని కీడు ముందటఁ దెల్పుమాడ్కి ని
శ్వాసంబుతో విషజ్వాల లొలుక

  1. బుస్సఁ