పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128 సింహాసనద్వాత్రింశిక

రాజు సెలవు[1] లేక రత్నంబు లిచ్చిన
తప్పునకును శిక్ష దలఁపు నాకు. 114

క. అనవుడు నృపుఁ డుత్తమమణి
ధన మిచ్చియు విఘ్న మైనతఱి నాజ్ఞాలం
ఘన మొనరింపక వచ్చితి
వని మెచ్చుగఁ జేతి మణులు వానికి నిచ్చెన్. 115

ఉ. కావున విక్రమార్కు సరిగావు నృపాలక చాలు నింటికిం[2]
బోవుట మేలు నాఁగ విని భోజుఁడు ఖిన్నముఖారవిందుఁడై[3]
భావములోన నాతని ప్రభావము నీగియు మెచ్చుచున్ సుహృ
ద్భూవరయుక్తుఁడై మగిడి పోయెను నెంతయు వింతచొప్పునన్.[4] 116

వ. ఇట్లు పంచమద్వారంబున నుండి మగిడి మఱియు నుత్సుకుండై. 117

ఆఱవబొమ్మకథ

క. లక్ష్మీనాయకసాయకుఁ
బక్ష్మలనయనాంకవామభాగుని ఘనునిన్
లక్ష్మాహిమకరధరు రజ
తక్ష్మాధరసదను మదనదమనుం గొలుతున్. 118

ఆ. అనుచుఁ గడఁగి భోజుఁ డట గొన్నిదినములు
చనిన విబుధవందిజనులఁ గూడి
యింద్రభద్రపీఠ మెక్కులగ్నంబుతోఁ
బొంతఁ జేరునంత బొమ్మ పలికె. 119

క. నిలు నిలువు విక్రమార్కుని
కొలఁదిని నిర్వ్యాజదానగుణ మటు నీకుం

  1. రాచసెలవు
  2. విక్రమార్కునికిఁ గల్గు గుణంబులు చాల వింటికిం
  3. ఖిన్నముఖాబ్జతేజుఁడై
  4. భోజుఁడు పోయెను దొంటి చొప్పునన్