పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

120 తృతీయాశ్వాసము

ఆ. దీనికంటె నొప్పు[1] దివ్యరత్నంబులు
గలవు మద్గృహమునఁ గొలుఁదిమీఱి[2]
ధరణినాథ నాకు దశకోటి ధన మిచ్చి
భటుని బంపు పదియు బంపువాఁడ. 86

క. అని చెప్పిన నాతని కా
ధన మిచ్చి భటాళిఁ జూచి తఱిదప్పకవే[3]
చనిరత్నంబులు గొని తె
చ్చినవానికి మెచ్చు గలదు చేకొనుఁ డనియెన్. 87

వ. అనిన నసహాయుశూరుండును నలఘుతరాంఘ్రితలలంఘనుండు నగు నొక్కజాంఘికుండు లేచి. 88

క. అచ్చట నారత్నంబులు
పుచ్చుకొనుచు నేడుదివసములు పో మఱునాఁ[4]
డిచ్చటికి నిన్నుఁ గొలువఁగ
వచ్చెద నీయడుగు లాన వసుధాధీశా. 89

సీ. అని పంతమాడిన హర్షించి తాంబూల
మిప్పించి వ్యయమున కేడుమాడ
లొసఁగి వర్తకుఁ గూడి మసలకుమీ యని
యనిపిన వానిఁ దోడ్కొనుచు సెట్టి
యశ్వరత్నమునెక్కి యతివేగమున రేలుఁ
బగళులు నెచ్చోటఁ దగులువడక
నాలుగుదినముల నలువదియామడ
ల్చని వీడు సొత్తెంచి తనగృహమునఁ

  1. మిగులు
  2. విలువమీఱి
  3. జనపతియా
    తనికాధనమిచ్చి భటులఁ దప్పకపంచెం
  4. నేడుదివసములమఱునాఁ
    డేనిచ్చటికి