పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 121

ఆ. దేజరిల్లుచున్న దివ్యరత్నంబులుఁ
బదియు నిచ్చి రాచబంటు నంత
గవని వెడల ననిపి క్రమ్మఱ నేగిన
వాఁడు నటకు నడచి వచ్చె నట్ల. 90

క. లంఘితనగనగరసరి
త్సంఘాతుం డగుచు దినము దప్పక వడి ని
స్సంఘర్షాధ్వగుఁడై యా
జాంఘికుఁ డరుదెంచెఁ బురికి సంధ్యావేళన్. 91

క. కాలూఁదక యట చని భూ
పాలుం గని మొక్కి తనదు పంతంబునఁ ద
త్కాలోచితదివసకర[1]
జ్వాలాకృతి వెలుఁగు నైదు సన్మణు లిచ్చెన్. 92

ఉ. ఇచ్చిన వానిఁ బుచ్చుకొని యేలిక యల్లనఁ జల్లచూపులం
దెచ్చినబంటుఁ జూచి మఱి తెమ్మిఁక నైదును నాకు నిప్పుడే
మిచ్చితి తోడి మానికము లేగతిఁ జిక్కిన వన్న[2] నాభటుం
డిచ్చఁ దలంకియుం దలఁక కిట్లనియెం గరము ల్మొగుడ్చుచున్. 93

ఆ. మొదల సెట్టిచేతఁ బదిరత్నములుఁ గొని
మగిడి వచ్చుచోఁ గ్రమక్రమమునఁ
బార్థివేంద్ర నాకు భాగ్య మింకినభంగిఁ
బెద్దయడవిలోనఁ బ్రొద్దుగ్రుంకె. 84

వ. అక్కడ మఱియు నొక్క చిక్కుగలిగె. 95

  1. దీపవర
  2. మఱి తెమ్మిఁక నైదునుగాక నాకు నై దిచ్చితి--ఐదును
    నాకు నిప్పు డీ విచ్చితి