పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96 సింహాసన ద్వాత్రింశిక

నుల్లము వ్రయ్య బు స్సనుచు నూరక మోగెడి పాముతోడి పొ
త్తొల్లక తద్భుజాగ్రమున నుర్వి సుఖస్థితి నుండు నెప్పుడున్. 158

వ. అట్టి యాతనితలంపు సంపదలందు నయవినయాదిగుణంబులం బొదలు. 159

క. ఓలం బగుసంపద నయ
శీలంబునఁగాక దుష్టచేష్టలఁ గలదే
యాలరిమొదవులకును దల
కోల యిడక చేరి పిదుకుకొనఁ[1] దర మగునే. 155

క. ఎక్కడనుండియు కూడును
నిక్కము లై తోఁచు నొక్కనిముసంబునఁ దా
మెక్కడికొ విరిసిపోవును
దక్కవు సంపదలు మేఘడంబరము క్రియన్. 156

క. కలిమికిని దగినకొలఁదిని
నెలగల వెలి విడువకున్న[2] నిలు పెక్కడి దౌ
కలయఁగ నిండిన చెఱువున
కలుఁగించుక విడువకున్న నాఁగనిభంగిన్. 157

సీ. అని యిట్టితలఁపున నశ్వమేధము సేయఁ
బూని భూసురబంధుభూమిపతుల
రప్పించి శుభముహూర్తమున దీక్షావిధి
గైకొని చేయుచో నాకవిభుఁడు
గరుడగంధర్వయక్షవ్రాతములతోడ
నరుదెంచి తోడ్పడి యాదరింప

  1. నిలిచిపిండుకొన
  2. వలసినకొలఁదిని నెలగల వెలి వెడలకున్న
    నెలగ=ధనము (నెలగలు)