పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86 సింహాసనద్వాత్రింశిక

సిగ్గుపడుచుఁ బూర్వద్వారగమనంబు మాని యపరద్వారగమనోత్సుకుం డగుచు నాఁటి కద్దివ్యాసనం బెక్కరాకుండుట తెల్లంబుగా మొగంబు తెల్లంబడఁ దిరిగి చని మఱి యొక్కనాఁడు. 103

మూఁడవబొమ్మ కథ

క. ఉల్లోలదుగ్ధసాగర
కల్లోలకరాగ్రమందకంపితఫణభృ
ద్వల్లభమణిమయడోలా
వేల్లనసుఖలోలుఁ డైన వేల్పుం దలఁతున్. 104

క. అని నియమంబున హితశా
కునికస్వరశాస్త్రవేదకోవిదయుతుఁ డై
యను వగుదినమున సింహా
సన మెక్కఁదలఁచి భోజజనపతి చేరెన్. 105

క. చేసిన నచ్చటిపుత్రిక
యారాజుం బలికె వాసవాసన మెక్కం
గోరుట జగ మెఱుఁగ మహా
దారిద్ర్యుఁడు క్రతువు సేయఁ దలఁచుటచుమ్మీ. 106

ఉ. ఆర్యులఁ గూర్చి నేఁడు శుభమైన ముహూర్తము చూచి వట్టిగాం
భీర్యము దోఁపఁగాఁ దగని పెద్దఱికం బిదియేల సన్నపుం
గార్యమె విక్రమార్కనృపుగద్దియయెక్కుట వానిఁబోల నౌ
దార్యము నీకుఁ గల్గినఁ బదం బిడు మోజగభోజభూవరా. 107

వ. అనుడు విస్మయమానమానసుండై మానవేంద్రుం డాసింహాసనయానంబు మాని యనుమానించి మీనరపతివితరణంబు లేతెఱం గెఱింగింపు మనిన నది యిట్లనియె. 108