పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 85



ఆ. భావ మస్తిరంబు గావున వీనివ్ర
తంబులెల్ల నిష్ఫలంబు లయ్యె
నీవు నిష్ఠ నిట్లు గావించితివి గాన
గడియలోన మెచ్చు గలిగె నీకు. 98

క. ధన్యుఁడ వనవుడు విని స
త్కన్యాదానమును దేవతావరమును రా
జన్యవరాజ్ఞయుఁ దిరుగుట
యన్యాయము గానఁ దిరుగ కంబిక వినుమా. 99

ఉ. ఇష్టములెల్ల నాకుఁ దగ నిచ్చెద నంటివి సర్వమున్ వ్రత
భ్రష్టుఁడు నాక వీనికిఁ గృపామతి నిమ్మని మ్రొక్కినంత సం
తుష్టి వహించి దేవత చతుశ్శతవత్సరభోగ్యమైన యు
త్కృష్టమహీపతిత్వమును దివ్యపదంబును నిచ్చె వానికిన్. 100

క. వానికి ని ట్లిచ్చి ధరి
త్రీనాయకుఁ బరిణమించి దేవియు నంత
ర్ధానమ్మునొందె విప్రుఁడు
నానృపు వెఱఁగంది పొగడి యరిగే నిజేచ్ఛన్. 101

శా. తత్సేవాఫలదర్శనంబున మహాప్రస్థానవిశ్రాంతిగా[1]
నుత్సాహంబును సాహసంబును బ్రతాపోదారభావంబు న[2]
త్యుత్సేకంబును భూషణాకృతులతో నొప్పారఁగా భూపతీ
వాత్సల్యంబున వచ్చె విక్రమయశోవర్ధిష్ణుఁ డుజ్జేనికిన్. 102

వ. కావున నీ కిట్టి గుణంబులు సమకూరకునికి నెక్కంజనదు పొమ్మనిన విని భోజుండును మనంబున నతనిం గొనియాడుచు నుద్విగ్నితాలగ్నుండై[3]

  1. దదధ్వశ్రాంతిగాఁ జిత్తమందుత్సా
  2. గర్వోత్సేకంబున
  3. విఘ్నితాలంఘితకాలజ్ఞుండై