పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 83

ఉ. ఇచ్చట నేండ్లు నూఱు సనియెన్ జగదంబిక నాయవస్థకు
న్మెచ్చదు కూడు మాని రవి మీఁదఁ దపింపగఁ వేల్మి సేసి ము
చ్చిచ్చున వెచ్చుచుండి తెగఁ జిక్కితి నన్నఁ, గృపానువృత్తిఁ దా
నచ్చటివాని లేపి విహితాసనుఁడై నృపుఁ డాత్మనిష్ఠతో. 86

క. వ్యాలోలకరాళకజి
హ్వాలం బగు సప్తజిహ్వువదనంబున భూ
పాలుఁడు మధుమిశ్రిత మగు
మాలూరఫలంబు వేల్చె మంత్రము కొలఁదిన్. 87

వ, అట్లు హోమంబు గావించిన నయ్యుమ నెమ్మనంబున నమ్మిక పొడమి పొడసూపకున్నం గడచూపునం గెంపుగదుర మదిం బదరి దొరకొన్నకర్జం బుజ్జగించుట యిజ్జగంబున నొజ్జల లజ్జలుడు పురజ్జులను నుజ్జయినిఱేఁడు మారేడుఁబండు మాని తన మెడం జూచి. 88

తే. పలుకుఁదేనియ గలతలపండు వేల్వఁ
దలఁచి తలచిక్కు చెక్కు మీఁదటికిఁ[1] జెరివి
యెడమకేలఁ దెమల్చుచు నడిద మెత్తి
మెఱుఁగుమిడుఁగుఱు లెగయగా మెడకుఁ బూనె. 89

వ. ఇట్లు పూని యుంకించిన. 90

క. ఓహూ నృప నీధర్మో
త్సాహములకు మెచ్చితిని నిజం బిది యిఁక నీ
సాహసము విడువు మని త
ద్బాహాఖడ్గంబు వట్టెఁ బరమేశ్వరియున్. 91

క. పట్టి నిలుచుండి నృప నీ
కెట్టిహితం బైన వేఁడు మిచ్చెద నని చే

  1. చక్క మీఁదటికి