పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82 సింహాసన ద్వాత్రింశిక

క. దుర్మార్గునకైన మహా
ధర్మస్థలి నాత్మశుద్ది దలకొను ననఁగా
ధర్మంబుల కాకరమౌ
నిర్మలునకుఁ జిత్తశుద్ది నిలుచుట యరుదే. 81

భుజంగ ప్రయాతము.
అతం డంత సుస్నాతుఁ డై రత్నహేమాం
చితం బై సువర్ణాద్రి చెల్వొంది దేవా
న్వితం బైన హర్మ్యంబు వే సొచ్చి యాదే
వతం గాంచి పూజించి వచ్చె న్నతుండై. 82

ఆ. అచటిహోమశాల కరిగి మౌనంబునఁ
ఘనతపోవిభూతి కలిమి మెఱసి[1]
మధురయుతములైన మారేడుఁబండుల
వేల్మి సేయుచున్న విప్రుఁ జూచి. 83

ఆ. అన్నపుష్పఫలజలాక్షతాదులు చేత
నున్నవాఁడును[2] జపహోమములను
జేయువాఁడు బ్రణతి సేయఁదగరుగాన[3]
మనుజవిభుఁడు మ్రొక్కు మానిపలికె. 84

క. ఓవిప్రోత్తమ హవనం
[4]బీవెరవున జరుగ వెన్ని యేఁడులు చనియె
న్నావుడు నుబ్బస పుచ్చుచు
నావిధిచేఁతలకు నేమి యనఁగల దధిపా. 8

-

  1. దపము కలిమి దోఁప జపముతోడ
  2. నున్నతనికిని
  3. జేయునతనికి నతి చేయఁదగదుగాన
  4. సహనం బీవెరవున ......నావుడునుబుస్సగొట్టుచు- చిన్నయసూరి