పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/124

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 63శా. ఈచందంబున మ్రొక్కి యందలముఁ దా నెక్కించి భూమీవరుం
డాచార్యుం గొని వచ్చి గద్దియపయిన్ హర్షంబుతో నుంచి శి
ష్టాచారంబునఁ బూజచేసి తనరాజ్యశ్రీ సమర్పించి త
ద్వాచాదత్తముగాఁగఁ గైకొని ప్రసాదం బంచు నేలె న్భువిన్. 314

మ. అని మంత్రీంద్రుఁడు చెప్పిన న్విని కథాహ్లాదప్రసన్నాత్ముఁడై
జననాథుండును మంత్రిలేనిపని మోసం బంచుఁ జేపట్టి యొ
య్యన సత్త్వాఢ్యులచేతఁ బుష్పకనిభంబౌ దివ్యసింహాసనం
బనువొందం గొనిపోయి నిల్పె నిజహర్మ్యంబైన ధారాపురిన్. 315

ఉ. శంభుముఖాంబుజార్కు దృఢసారవరాహశరీరవశ్యవి
శ్వంభరు శాంభవీవరదు సంభృతరక్షణు సర్వలోకకు
క్షింభరు సిద్ధసాధ్యసురకిన్నరపన్నగగీతకీర్తివి
శ్వంభరు జంభవైరిసహసంభవు దృష్టవపుర్విజృంభణున్. 316

ఉ. శంకితకింకరవ్రజవశంకరుఁ బంకజనేత్రమిత్రు న
భ్రంకషకాంతిసంకులకపర్దవిభూషితభవ్యదివ్యకూ
లంకషు నిష్కళంకితవిలాసకలాపధురీణు శౌర్యస
ర్వంకషవైభవాంకితవశంకరు శంకరు లోకశంకరున్. 317

మాలిని. పరమకరుణలీలా భక్తలోకానుకూలా
పరిచితసురరక్షా భగ్నదైతేయవక్షా
సరసిజహితనేత్రా సచ్చిదానందగాత్రా
హరిహరమయరూపా యాగయోగస్వరూపా. 318

గద్యము. ఇది రాయగజగంధవారణ వైరిమండలికభేకఫణీంద్ర వీరఘోట్టవిభాళాది బిరుదప్రకటచారిత్ర కళింగదేశనిర్దూమధామత్యాగనాగార్జున కర్ణాటద్రవిళాంధ్రమహారాష్ట్రభూపాల రూపనూపురసుందరచరణారవింద సనదప్రోలి పురవరాధీశ్వర వెలనాఁటిపృథ్వీశ్వర రాజ్య