పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/123

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
62
సింహాసన ద్వాత్రింశికఆ. పిన్నదాన విచట నున్నదానవు తల్లి
యింటివాకిలియును నెఱుఁగ వీవు
కానలోనఁ బులియు మానిసియు నెలుంగుఁ
దొడరు చేఁత లెట్లు తోఁచె నీకు. 307

వ. అనుడు నతం డింకఁ దాఁపం బని లేదని తలంచి. 308

క. భూనాయక! భూసురకృప
నానాలుక నొప్పు వాణి నానాదృఢవి
జ్ఞానమునఁ దెలియు నన్నియు[1]
భానుమతీదేవిమచ్చభంగి న్మదిలోన్. 309

మ. అనినన్ దిగ్గన లేచి చూచి తెరలో నాచార్యుఁగా నిశ్చయిం
చి నరేంద్రుం డతిహృష్టుఁ డౌచు సచిపుం జేపట్టి నీ యట్టి బరి
ధునిధానం బిఁక నొండు గల్గునె గురుద్రోహంబుఁ దప్పించి యెం
దును బాపంబును బొందకుండ నను ధన్యుంజేసి తీ నేర్పునన్. 310

క. ప్రణయము దప్పక యా బ్రా
హ్మణహత్య దొలంగ రాజ్య మలరఁగ సుతుదు
ర్గుణములు విడిపించితి నీ
గుణములచే నన్ను జట్టిగొంటివి చుమ్మీ. 311

వ. అని గ్రుచ్చి కౌగిలించుకొని తనపట్టిచెట్ట పట్టుకొని పుణ్యసులభానుమతి యగు భానుమతియుం దానును గురు డగ్గఱి. 312

క. ఎల్లవిధంబులఁ జూచిన
దల్లియుఁ దండ్రియును నీవె దయసేయుము మా
కల్లలు లోఁగొని మము నీ
నల్లిల్లుగఁ జూడు మనుచు నరపతి మొక్కెన్. 313

  1. జ్ఞానముఖంబున వెలయున్