సాక్షి సంఘనిర్మాణము
1
1. సాక్షి సంఘనిర్మాణము
ఎందుకీ సాక్షి సంఘం?
ప్రత్యేక రాజకీయ దండనం మాత్రమే నేరాన్ని అణగదొక్క జాలదు. దానికి తోడుగా "సంఘశిక్ష " కూడా ఉండాలి. అంటే నేరగాడితో ఎవరూ జోక్యం పెట్టుకోక పోవడం. అటువంటి వాణ్ణి సభలోకి రానీయకపోవడం. గౌరవించకుండా ఉండడం. పదిసంవత్సరాల కఠిన శిక్ష కంటె పదిమంది సంఘంవల్ల నేరగాడికి చేసిన అనాదరణ నేరాన్ని ఆపడంలో బలవత్తరం. రాజకీయ దండనానికి అందని నేరాలను గురించి వెల్లడించడం సాక్షిసంఘం ఉద్దేశం. వాటి స్వభావాల్ని వివరించడం, వాటివల్ల సంఘానికి కలిగే చెడును స్పష్టంచెయ్యడం, వాటిమీద ప్రజలకి అసహ్యం కలిగించడం, ఈ సంఘం ఉద్దేశం. నేరాలనే నిందించడం ఉద్దేశంగాని, అటువంటి నేరాలకులోనైన వారిని నిందించదీ సాక్షి సంఘం.
ఈ సాక్షిలో మత విషయాలగురించీ, ఆరోగ్య విషయాలగురించీ, కవిత్వంపట్ల అభిరుచికి సంబంధించిన శాస్త్రాలగురించీ, సంఘ దురాచారాల గురించీ, విద్యాభివృద్ధి సాధనాలగురించీ, చరిత్ర మొదలైన విషయాల గురించీ రాజభక్తివంటి వాటిగురించీ అవసరమనిపించిన మరికొన్ని విషయాల గురించీ వ్రాస్తూంటారు.
ఈ సాక్షి సంఘ సభ్యులు అయిదుగురు. వీరు-
సాక్షి, జంఘాలశాస్త్రి, వాణీదాసు, కాలాచార్యులు, బొర్రయ్యశెట్టి.
వీరు. ప్రతిరాత్రి ఒక అద్దె ఇంట్లోచేరి ప్రసంగిస్తూంటారు. వీరందరి ఊరు సత్యపురం. సాక్షి సంఘం ఆఫీసు పోస్టాఫీసుకి ఎదుట -
ప్రాపంచిక చర్యలు చిత్ర విచి త్రాతివిచిత్ర మహావిచిత్రములై యున్నవని మీరెఱిఁగినయంశమే. ఇది మీరు క్రొత్తగఁ జూచినది కాదు. మేము క్రొత్తగఁ గనిపెట్టినది కాదు. కాని దిగువఁజెప్పబోవు కారణముచే మేమనవలసి వచ్చినది. మాయుద్యమసాఫల్యమునకై మీరు వినవలసి, వచ్చినది. సృష్టిలో మనుష్యులెందఱో మనుష్యప్రకృతులన్నియై యున్నవి. ఏ రెండును సమములు గావు. సర్వశక్తిమంతుఁడును జ్ఞాన స్వరూపుఁడు నగు భగవంతుఁడు తన బుద్ధిబలముచే నిన్ని వేఱువేఱు స్వభావములు సృష్టింపఁగ మనుజుఁడు