Jump to content

పుట:సమీరకుమార విజయము.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

స మీ ర కు మా ర వి జ య ము


⁠

గూరిచి తత్ప్రబంధమునకున్ బతి నెవ్వరిఁ జేతు నంచు లోఁ
గూరినజాలి నొండొకరిఁ గూడి వచింపక యొక్కనాఁడు గౌ
రీరమణాలయంబుకడ రేపటివేళ వసించి నిష్ఠతోన్.

⁠ 20


సీ.⁠

స్వస్తికాసనమున వసియించి యమనియమంబులు సవరించి మారుతంబు
పూరకకుంభకంబులఁ గట్టిగాఁ బట్టి చూపు నల్ త్రోవలచోట నిలిపి
తనువుతో విశ్వ మంతయును శూన్యము చేసి వ్యాపార మందనియాత్మఁ దెచ్చి
ఖేచరీముద్రలోఁ గీలించి పరిపూర్ణచిత్తవిశ్రాంతిమైఁ జిన్మయైక

⁠


ఆ.⁠

గగనరీతి రెండు గానియఖండతా, వ్యాప్తి ద్రిపుటికొంత యడఁగి వింత
సుప్తిఁ బోనితుర్యసుఖముఁ బ్రాపించంగా, నంతలోన నాత్మ కద్భుతముగ.

⁠ 21


తే.⁠

నిష్కళ నిరంజనసమాధినిష్ఠ నడఁచి, మిక్కుటపుమించు నిర్మించుమించుతోడ
నీలజీమూతకాంతుల నిగుడువిఘ్న, మని మతిస్థైర్యమునఁ ద్రోయునంతలోన.

⁠ 22


సీ.⁠

సీమంతపదవిఁ గూర్చిన ముత్యములడాలు తనదరస్మిత కాంతి ననుసరింపఁ
గడకంటిననుచూపుబెడఁగు తా నిడికొన్న నీలహారస్ఫూర్తి నివ్వటిల్లఁ
దళుకుఁగమ్మమెఱుంగు దనభుజాంగదధగద్ధగితరత్నశ్రీకి దండ గాఁగ
గరసరోజాగ్రకంకణమణిప్రభ దనకటిహైమపటదీప్తిఁ గౌఁగిలింపఁ

⁠


తే.⁠

దొలుతటితటిద్ఘనము లాకృతులు ధరించె
నొక్కొ నా గొమ్మకేల్ దమ్మి యొక్కకేలఁ
గ్రమ్మి శతకోటిమదనశృంగారమూర్తి
ఘనుఁ డొకానొకపురుషుండు గానిపించె.

⁠ 23


చ.⁠

రవిశశిమండలంబులస్థిరత్వము మానక కొంతలోవలం
దవిలినగాడ్పు వీడక మనస్కతకై గుఱియందు డిందుబిం
దువు నెరిఁ గ్రమ్మనీక యటఁ దోఁచినరూపులు ద్రోయఁ గ్రమ్మఱం
దివిరిననన్ను లేనగవు దేరఁ గనుంగొని యాఘనుం డనున్.

⁠ 24


ఉ.⁠

ఓయి సుధీంద్ర నీవిమలయోగవిరోధము సేయరాము మే
మీ యెలనాఁగ సీత విను మే రఘురాముఁడ మామరుత్సుతుం
బాయక కొల్చి తత్కథఁ బ్రబంధము చేసెద వంకితంబుగాఁ
జేయుము మాకు నీ కెఱుక చెల్వగు నంచు నదృశ్య మౌటయున్.

⁠ 25


ఉ.⁠

అంత సమాధి మాని హృదయంబున విశ్వము దోఁప నంతవృత్తాం
తముఁ జింత చేసి యవురా! నిజదాసకథల్ గణింపఁగా

⁠