పుట:సత్యశోధన.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆత్మకథ

71

వెళ్ళిపోయారు. ఆయన ఫ్రెంచి భాష కొంచెం నేర్చుకున్నారు. కొన్ని ఫ్రెంచి గ్రంథాల్ని అనువదించడానికి పూనుకున్నారు కూడా. ఆయన అనువాదం సరిచూడగలిగినంత ఫ్రెంచి భాష నాకూ వచ్చు. అందువల్ల అనువాదం ఎలా వుందో చూడమని ఆయన నాకు ఇచ్చారు. అది నిజానికి అనువాదం కాదు. భావార్థం మాత్రమే.

అమెరికా వెళ్ళాలనే తన కోరికను కూడా తీర్చుకున్నారు. తంటాలుపడి చివరకు డెక్ టిక్కెట్టు సంపాదించారు. షర్టు, ధోవతి కట్టుకొని వెళ్ళడం అమెరికాలో అసభ్యతా లక్షణమట. ఆయన అవి ధరించి బజారుకు వెళ్ళగా అయన్ని అమెరికాలో ప్రాసిక్యూట్ చేశారట. తరువాత ఆయనను విడిచి వేసినట్లు గుర్తు.

23. పెద్ద సంత

1890వ సంవత్సరంలో పారిస్‌లో గొప్ప సంత జరిగింది. అందుకోసం పెద్ద ఏర్పాట్లు చేయబడుతున్నాయని పత్రికల్లో చదివాను. నాకు పారిస్ నగరం చూడాలనే కోరిక కలిగింది. రెండు పనులు కలిసి వస్తాయని భావించి పారిస్ వెళ్ళాలని నిర్ణయించాను. ఆ సంతలో ఏఫిల్ టవర్ (గోపురం) అనునది గొప్ప వింత. దాని పొడవు వేయి అడుగులు. కేవలం ఇనుముతో కట్టబడింది. ఇంకా అనేక వింతలు అక్కడ వున్నాయి. కాని ఆ గోపురం మాత్రం గొప్ప వింత. అంత ఎత్తుగల కట్టడం స్థిరంగా వుండదని అక్కడ అంతా అనుకుంటూ వుంటారు.

పారిస్‌లో శాకాహారశాల ఒకటి వున్నదని విన్నాను. అందొక గది నా కోసం ఏర్పాటు చేసుకున్నాను. ఏడురోజులు అక్కడ ఉన్నాను. తక్కువ ఖర్చుతో పారిస్ వెళ్ళడానికి, అక్కడ ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాను. పారిస్ నగర పటం ఒకటి, సంతకు సంబంధించిన వివరాలు తెలిపే పుస్తకం ఒకటి సంపాదించి దగ్గర పెట్టుకున్నాను. చాలా ప్రదేశాలకు నడిచే వెళ్ళాను. మ్యాపు సహాయంతో రాజవీధులకు, దర్శనీయ స్థానాలకు వెళ్ళడం తేలిక అయింది.

ఆ ప్రదర్శనశాల అంతగా గుర్తులేదు. దాని వైశాల్యం, వైవిధ్యం మాత్రం జ్ఞాపకం వున్నాయి. రెండు మూడు సార్లు ఎక్కడం వల్ల ఏఫిల్ టవర్ నాకు చక్కగా గుర్తు ఉంది. దాని మీద మొదటి మజిలీలో భోజనశాల ఉంది. అంత ఎత్తున భోజనం చేశానని చెప్పుకునేందుకుగాను దాని మొహాన ఏడు షిల్లింగులు పారవేశాను.

పారిస్ నగరంలో గల చర్చి గృహాలు జ్ఞాపకం వున్నాయి. వాటి భవ్యస్వరూపం, వాటిలోపల లభించే శాంతి మరిచిపోదామన్నా వీలులేనివి. నోటర్ డామ్ కట్టడపు పని, లోపలి చిత్తరువులు, అక్కడి చెక్కడపు పని చిరకాలం జ్ఞాపకం వుంటాయి. అట్టి