పుట:సత్యశోధన.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

62

మతాలతో పరిచయం

బాగా నవ్వుకున్నాం. నీవు అసత్యానికి పాల్పడ్డావు. అది క్షమించడానికి అర్హమైన తప్పిదమే. నీవు నిజం తెలుపడమే ఆ అర్హతకు కారణం. నీకు స్వాగతం. నా ఆహ్వానం నీకు ఎప్పుడూ వుంటుంది. వచ్చే ఆదివారంనాడు నీ కోసం మేమిద్దరం ఎదురు చూస్తూ ఉంటాము. నీ బాల్య వివాహం గురించి వివరాలు వింటాము. నిన్ను ఎగతాళి చేసి ఆనందం పొందుతాము. మన స్నేహం ఎప్పటిలాగానే స్థిరంగా ఉంటుంది. పూర్తిగా నమ్మవచ్చు,

నాలో ముదిరిన అసత్యమనే ఈ వ్రణాన్ని తొలగించుకుని నయం చేసుకోగలిగాను. తరువాత ఇలాంటి వ్యవహారం జరిగినప్పుడు నా వివాహం సంగతి ముందే చెప్పివేయగల ధైర్యం నాకు కలిగింది.


20. మతాలతో పరిచయం

ఆంగ్లదేశంలో వున్న రెండవ ఏడు చివరిభాగంలో ఇద్దరు దివ్యజ్ఞాన సామాజికులతో నాకు పరిచయం కలిగింది. వారు సోదరులు, అవివాహితులు. భగవద్గీత చదవమని వారు నన్ను ప్రోత్సహించారు. వారు సర్ ఎడ్విన్ అర్నాల్డుగారు గీతకు చేసిన ఆంగ్లానువాదం చదువుతున్నారు. తమతో కలిసి సంస్కృతం గీత చదువుదాము రమ్మని నన్ను ఆహ్వానించారు. నేను సిగ్గుపడ్డాను. దాన్ని అంతవరకు చదవకపోవడం. కనీసం గుజరాతీ అనువాదాన్ని అయినా చదవకపోవడమే అందుకు కారణం. ఈ విషయం సంకోచిస్తూనే వారికి చెప్పాను. నాకు సంస్కృతం ఎక్కువగా రాదు. అయితే మూలానికి అనువాదానికి తేడా వస్తే ఆ వివరం చెప్పగలను అని చెప్పి వారితో బాటు గీత చదవడం ప్రారంభించాను. ద్వితీయ ఆధ్యాయంలో రెండు శ్లోకాలున్నాయి.

“ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే!
సంగాత్సంజాయతేకామః కామాత్ క్రోధోభిజాయతే
                           సాంఖ్యయోగం - శ్లోకసంఖ్య 62
క్రోధాద్భవతి సంమోమః సమ్మోహాత్ స్మృతి విభ్రమ:
స్మృతి భ్రంశాద్బుద్ధినాశో బుద్ధి నాశాత్ ప్రణశ్యతి
                           సాంఖ్యయోగం. శ్లోక సంఖ్య 63

(శబ్దాది విషయాలను సదా ధ్యానిస్తూ వుంటే మనిషికి వాటియందు ఆకర్షణ కలుగును. దానివలన కోరిక పుట్టును. కోరిక ద్వారా కోపము కలుగును.

కోపం వల్ల అవివేకమావహించును. అవివేకం వల్ల మతి భ్రమ కలుగును. దాని వల్ల బుద్ధి నశించును. బుద్ధి నశించినచో సమస్తము హతమగును.)