పుట:సత్యశోధన.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

32

సీమకు ప్రయాణ సన్నాహం



దమ్మిడినీకిచ్చు ధన్యాత్మునకు మాఱుగా నిమ్ము నీ నెమ్మేనినేని కోసి
ఒకటియొసగిన బదిరెట్టులొసగవలయు
చెట్టు చేసిన మేలును జేయవలయు
ప్రాతఃకాలము నాటి యీ చేతలెల్ల
అనుపూర్విగ సత్యరహస్యమరయ”
(తెలుగు సేత - శతావధాని వేలూరి శివరామశాస్త్రి)


11. సీమకు ప్రయాణ సన్నాహం

1887 వ సంవత్సరంలో నేను మెట్రిక్యులేషన్ పరీక్షకు కూర్చున్నాను. అప్పుడు అహ్మదాబాదు, బొంబాయి, పరీక్షాకేంద్రాలు. దేశంలో దారిద్ర్యం ఎక్కువగా వుండటంవల్ల కాఠియావాడ్ విద్యార్థులు తమకు దగ్గరలో వున్న కొద్ది ఖర్చుతో పని జరిగే అహ్మదాబాదు కేంద్రానికి వెళ్ళేందుకు ఇష్టపడేవారు. మా కుటుంబ ఆర్థికస్థితి కూడా అంతంతమాత్రంగానే వుంది. అందువల్ల నేను ఆ కేంద్రానికే వెళ్ళవలసి వచ్చింది. రాజకోట నుండి అహ్మదాబాదు ఒంటరిగా మొదటిసారి ప్రయాణం చేశాను.

మెట్రిక్యులేషన్ పూర్తి అయిన తరువాత కాలేజీలో చదవమని మా పెద్దలు ప్రోత్సహించారు, భావనగర్ మరియు బొంబాయిలో కాలేజీలు వున్నాయి. భావనగర్‌లో ఖర్చు తక్కువ అందువల్ల అక్కడి శ్యామలదాస్ కాలేజీలో చేరాను. కాని అక్కడంతా అడవి గొడవ. ఉపాధ్యాయులు చెప్పేది నాకు బోధపడలేదు. అది వారి లోటు కాదు. నా లోటే. ఆరు నెలలు గడిచాయి. ఇంటికి వెళ్ళాను. “మావుజీదవే” అనువారు మా కుటుంబానికి పాత మిత్రులు. మాకు మంచి చెడులు చెబుతూ వుండేవారు. ఆయన బ్రాహ్మణులు, విద్వాంసులు. వ్యవహారదక్షులు. మా తండ్రిగారు గతించిన తరువాత కూడా మా కుటుంబ కష్టసుఖాల్ని గురించి తెలుసుకుంటూ వుండేవారు. సెలవుదినాల్లో వారు మా ఇంటికి వచ్చారు. మా అమ్మగారితోను, మా పెద్దన్నగారితోనూ మాట్లాడుతూ నా చదువును గురించి అడిగారు. నేను శ్యామలదాసు కాలేజీలో చేరి చదువుతున్నానని తెలుసుకున్నారు. కొంత సేపు యోచించి వారు ఈ విధంగా అన్నారు. “ఇప్పుడు కాలం మారింది. తగిన చదువు లేందే మీలో ఎవ్వరూ ఇప్పుడు మీ నాన్నగారు పొందిన పదవి, హోదా పొందలేరు. ఈ పిల్లవాడు చదువులో ముందడుగు వేస్తున్నాడు. కనుక ఇతడు ఈ హోదాను నిలుపుకునేలా చూడండి. బి.ఏ. ప్యాసు కావాలంటే ఇంకా నాలుగేళ్ళ సమయం పడుతుంది. ఎంత తంటాలుపడ్డా నెలకు 50 లేదా 60 రూపాయలు మాత్రమే సంపాదించగలుగుతాడు. దివాను మాత్రం కాలేడు. మా కుమారుని వలె