పుట:సత్యశోధన.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

మతంతో పరిచయం


10. మతంతో పరిచయం

ఆరవ ఏట నుంచి ప్రారంభించి పదహారు సంవత్సరాల వయస్సు వచ్చేదాక విద్యాధ్యయనం కావించాను. కాని పాఠశాలలో అప్పటిదాకా మతాన్ని గురించిన బోధ జరుగలేదు. కాని అక్కడి వాతావరణం వల్ల అట్టి కొత్త శిక్షణ లభించింది. ఇక్కడ ధర్మం అంటే ఆత్మబోధ లేక ఆత్మజ్ఞానమను విశాల అర్థాన్ని పాఠకులు గ్రహించుదురు గాక. వైష్ణవ సంప్రదాయంలో జన్మించడం వల్ల దేవాలయం వెళ్ళే అవకాశం నాకు తరచుగా లభిస్తూ ఉండేది. కాని ఆ కోవెల అంటే నాకు శ్రద్ధ కలుగలేదు. దాని వైభవం నాకు బోధపడలేదు. అచట కొంత అవినీతి జరుగుతున్నదని విని దాని యెడ ఉదాసీనత ఏర్పడింది.

అయితే నాకు అక్కడ అబ్బని విశేషం ఒకటి మా కుటుంబమందలి దాసివల్ల అబ్బింది. ఆమె నా యెడ చూపించిన వాత్సల్యం ఇప్పటికీ నాకు గుర్తు వున్నది. భూత ప్రేతాదులంటే నాకు భయం అని మొదట వ్రాశాను. మా కుటుంబదాసి పేరు రంభ. ఆమె భూత ప్రేతాదుల భయానికి రామ నామ స్మరణం మంచి మందు అని చెప్పింది. ఆమె చెప్పిన మందు మీద కంటే ఆమె మీద నాకు అమిత నమ్మకం ఏర్పడింది. దానితో అప్పటినుండి భూత ప్రేతాదుల భయం పోయేందుకై రామనామ జపం ప్రారంభించాను. ఆ జపం ఎక్కువ కాలం చేయలేకపోయినా చిన్ననాట హృదయంలో నాటుకున్న రామనామమును బీజం తరువాత కూడో చెక్కు చెదరకుండా ఆలాగే హృదయంలో వుండిపోయింది. ఈనాడు రామనామం నా పాలిట దివ్యౌషధం. ఆనాడు అది రంభ చాటిన విత్తనమే.

ఆ రోజుల్లో మా పినతండ్రి కొడుకు యొక్క సాహచర్యం మాకు లభించింది. అతడు రామభక్తుడు. మా అన్నదమ్ములిద్దరికీ అతడు రామరక్షాస్తోత్రం నేర్పే ఏర్పాటు చేశాడు. ఆ స్తోత్రం మేము కంఠోపాఠం చేశాము. ప్రతిరోజు ప్రాతఃకాలం స్నానం చేసిన తరువాత రామనామ స్తోత్ర జపం చేయడం అలవాటు చేసుకున్నాం. పోరుబందరులో వున్నంత కాలం మా జపం నిర్విఘ్నంగా సాగింది. రాజకోట వాతావరణం వల్ల కొంత సడలిపోయింది. ఈ జపం మీద నాకు శ్రద్ధ కలుగలేదు. మా పినతండ్రి కుమారుని యెడగల ఆదరభావం వల్ల రామరక్షాస్తోత్రం శుద్ధమైన ఉచ్చారణతో సాగుతూ వుండేది.

రామాయణ పారాయణం ప్రభావం నా మీద అమితంగా పడింది. మా తండ్రి గారు జబ్బు పడ్డప్పుడు కొంతకాలం పోరుబందరులో ఉన్నాం. అక్కడ గల రామాలయంలో రోజూ రాత్రిపూట రామాయణం వింటూ వుండేవాణ్ణి, రామభద్రుని