పుట:సత్యశోధన.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉండవచ్చు. అయినా అక్కడి నిర్ణయాలు నీతిబద్ధమైనవి. సరియైన సత్యమైన పద్ధతులను అనుసరించేవి . ఏదో తాత్కాలికమైన, నేతి బీర వంటి వృద్ధి కొరకు ఉద్దేశించినవి కావు”[1] అని వ్రాశారు.

గాంధీజీ ఆధునిక సాంకేతిక విజ్ఞాన మార్గాలను ఏదో ఆధ్యాత్మిక అభిరుచి వల్ల వ్యతిరేకిస్తారు అనే ఊహ శుద్ధ తప్పు. “ప్రతి సాంకేతిక అన్వేషణను అందరికీ ఉపయోగించాలి. చేయవలసిన పని పెద్దది - చేసేవారు తక్కువగా ఉన్నారు - ఆ సందర్భంలో యాంత్రిక సౌలభ్యానికి స్వాగతం. కాని భారతదేశంలో వలె, ఆ పనికి మించిన పని వారు ఉన్నప్పుడు, అది తగినది కాదు”[2] అని అంటారు గాంధీజీ. కనుక యాంత్రికీకరణకు గాంధీజీ వ్యతిరేకులు కారు. కానీ యంత్రాల యెడల “ఉన్మాద ప్రేమ” ను “విచక్షణా రహితమైన యంత్రవృద్ధి” ని ఆయన ఒప్పుకోరు. “లెక్కకు మించిన ఉత్పత్తికి” బదులు లెక్కకు మించిన శ్రామికుల ద్వారా ఉత్పత్తిని” గాంధీజీ కోరుకుంటారు. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో, పెట్టుబడి తక్కువ, అనంతమైన శ్రామికశక్తి ఉన్న సందర్భంలో, ప్రజాస్వామ్య పద్ధతుల్లో శ్రామికులు శక్తిని నిర్మాణాత్మకంగా వృద్ధి చేయడం సాధ్యం అంటారు ఆయన. దీనినే ఇంకోమాటగా “మెగా (బృహత్) యంత్రం” అన్నారు ప్రొఫెసర్ మంఫర్డ్.[3]

వస్తూత్పత్తి ప్రగతి, దాని ఫలితంగా సంభవించే మదమత్త సత్తా ఒక చీకటిదారి. పద్మవ్యూహం. ఆధునిక పారిశ్రామిక వ్యవస్థ బలిసిన వాణిజ్య సంస్థలకు జన్మనిచ్చి, దేశాన్ని ప్రొఫెసర్ గాల్‌బ్రైత్ మాటల్లో “నిపుణులు, ప్రణేతలు, సాంకేతిక నిపుణులు ఉన్న ఒక సాంకేతిక భూత బంగ్లా”ను సృష్టిస్తుంది. ఇటువంటి పారిశ్రామిక వ్యవస్థలోని దుష్టశక్తిని నిరోధించేందుకు, అమెరికన్ ఆర్థికవేత్తలు “ఇతర ధ్యేయాల ఉద్ఘోషణ” ను గురించి నొక్కి చెప్పి. ఇందువలన క్రొత్త పారిశ్రామిక దేశం “సమాజానికి అవసరమైన విస్తృత విషయాలకు స్పందిస్తుంది అంటారు.[4]. ఈ ధ్యేయాలు గాంధీజీ ప్రవచించిన ఆదర్శ కార్యక్రమాలకు అనుగుణంగా ఉంటాయి కూడా.

మహాత్మాగాంధీ. మన దేశంలోనూ, విశ్వవ్యాప్తంగానూ ఉన్నటువంటి “అదృష్టహీనుల” ఎడల శ్రద్ధ చూపిస్తారు. సర్వోదయ నమాజంలో అందరూ పైకి రావాలి అంటూనే, ప్రప్రథమ ప్రయత్నం బడుగు వర్గాల ఉద్ధరణ అంటారు. “అన్ టూ

  1. న్యూ స్టేట్స్‌మన్, లండన్ 31-5-1968
  2. హరిజన, 16-11-1934
  3. “ది న్యూ ఇండస్ట్రియల్ స్టేట్” ప్రొఫెసర్ జె. కె. గాల్‌బ్రైత్, 1967, పు. 399
  4. “ది న్యూ ఇండస్ట్రియల్ స్టేట్” ప్రొఫెసర్ జె. కె. గాల్‌బ్రైత్, 1967 పు. 399