పుట:సత్యశోధన.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దిస్ లాస్ట్” అనే గ్రంథంలో రస్కిన్ మహాశయుడి సిద్ధాంతం ఆయన జీవితమంతటా ప్రయోగాలు, ప్రయత్నాలు సామాజిక ఉద్ధరణ మొదలైనవాటికి ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఈ సర్వోదయ మార్గమే వలస రాజ్యతత్త్వానికి, వర్ణభేద భావనకి వ్యతిరేకంగా ఆయన జీవన పోరాటం చేసేటట్లు చేసింది. “నీ ఆత్మశక్తి తగ్గి, సందేహం కలిగినప్పుడు, ఆ దరిద్ర నారాయణుడి దీనవదనం గుర్తుకు తెచ్చుకొని, నీవు చేసే పని అతడికి ఏవిధంగా పనికి వస్తుంది? అని ప్రశ్నించుకో. ఈ పరీక్షతో నీ సంశయాలన్నీ మంచులా విడిపోతాయి” అన్నారు గాంధీజీ.[1]

ప్రజాస్వామ్య వ్యవస్థపై గాంధీజీకి ప్రగాఢ విశ్వాసం. అహింస, స్వేచ్ఛాయుత సహకారం వల్లనే నిజమైన ప్రజాస్వామ్యం ఏర్పడుతుందనే వారు ప్రజాస్వామ్యం బయటినుంచి చొప్పించడం సాధ్యం కాదు. అది అంతరంగంలోంచి మాత్రమే రావాలి అంటారు గాంధీజీ.[2] అంతర్జాతీయ వ్యవహారాల్లో ‘పరస్పర గౌరవం, నిజాయితీ’ అనే పునాదుల మీద నిర్మితమైన “విశ్వ సమాఖ్య” ను గురించి ఆయన కలలు కన్నారు. భారతదేశ స్వాతంత్ర్యం పునరుత్థానం కోసం నిరంతరం శ్రమిస్తూ కూడా, “ఏకదేశ పరిమిత స్వాతంత్ర్యం” అంటే అయిష్టంగా ఉండేది ఆయనకు. తమ ప్రత్యేకత నిలుపుకుంటూనే ప్రతీదేశం, ఇతర దేశం యొక్క మంచి గుణాలను ఆకళింపు చేసుకోవాలి అంటారు గాంధీజీ. ఆయన ఆదర్శసూక్తం ఇది. నా ఇంటికి నలువైపులా గోడలు కట్టడం గాని, నాకిటికీలు మూసి ఉంచడం గానీ నాకు సమ్మతం కాదు. స్వచ్ఛందంగా అన్ని దేశాల సంస్కృతులు నా ఇంటిలో ప్రసరిస్తూ ఉండాలి. అయితే, ఏ శక్తీ, నా కాళ్ళమీద దృఢంగా నిలిచిన నన్ను చలింప చేయడం, నేను అంగీకరించను.”[3]

జీవన పర్యంతం, మానవ ప్రగతికి, ఆ ప్రగతికి తీసుకుపోయే మార్గదర్శక సూత్రాల ప్రవచనానికీ, ప్రయోగానికి శ్రమించిన ఆ మహనీయుని శతజయంతిని ఆదర్శయుతంగా జరపడం అవసరం. పండిత నెహ్రూ మాటలలో (అనన్య ప్రస్తుతిలో) “ఇన్ని సంవత్సరాలు ఈ దేశాన్ని కాంతిమయం గావించి, మున్ముందు వేలాది ఏండ్లు తన ఉజ్జ్వల ధీధితులతో, విశ్వాన్ని ప్రకాశవంతం చేస్తూ లెక్కకు అందని మానవ హృదయాల బాధలకు సేద చేకూర్చగలిగిన ఈ జ్యోతి - ఈ క్షణానికి చెందినది మాత్రమే కాక, సర్వకాల సర్వావస్థలకు సంబంధించిన శాశ్వత జీవత్సూత్రాలను ప్రవచిస్తూ, తప్పుదారి నుంచి మనలను మళ్ళిస్తూ, సరియైన దారిలో పోయేందుకు

  1. మహాత్మాగాంధీ - ది లాస్ట్ ఫేజ్, సంపుటం 2, ప్యారేలాల్ 1958, వుట 65
  2. ది హిస్టరీ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, డా. పి. సీతారామయ్య 1935. పుట 982
  3. యంగ్ ఇండియా. 1-6-1921