పుట:సత్యశోధన.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

270

లొకేషను దగ్ధం

పరిష్కరించాను. బ్యాంకు మేనేజరుతో నాకు పరిచయం ఉన్నది. మీ దగ్గర డబ్బు నిల్వ చేస్తానని ఆయనకు చెప్పాను. బ్యాంకు వెండి, రాగి వస్తువుల్ని తమ వద్ద ఉంచేందుకు అంగీకరించలేదు. ప్లేగు సోకిన ప్రదేశానికి సంబంధించిన వస్తువులని తెలిస్తే బ్యాంకులో పని చేస్తున్న వారు వాటిని తాకేందుకు కూడా సిద్ధపడేవారు కారు. అయితే బ్యాంకు మేనేజరు తెలిసినవాడు కావడం వల్ల అన్ని సౌకర్యాలు కల్పించాడు. డబ్బును క్రిమినాశక మందులచే కడిగి బ్యాంకులో వుంచడానికి నిర్ణయించాము. ఈ విధంగా 60 వేల పౌండ్లు బ్యాంకులో జమ చేసినట్లు గుర్తు.

కొంతకాలం పాటు ఫిక్సెడ్ డిపాజిటులో డబ్బు జమ చేసుకోమని బాగా డబ్బు గల కక్షిదారులకు చెప్పాను. ఆ విధంగా వారి డబ్బు బ్యాంకులో అమితంగా జమపడింది. దానితో బ్యాంకులో సొమ్ము జమ చేయడం, అవసరమైనప్పుడు తీసుకోవడం వాళ్ళకు తెలిసింది. లొకేషను వాసులందరినీ క్లిపస్పృట్ అను ఫారానికి ప్రత్యేక రైల్లో తీసుకువెళ్ళారు. వాళ్ళకు నీరు మునిసిపాలిటీ వారు తమ ఖర్చుతో అందజేశారు. ఆ పేటను చూస్తే సైనికుల బస్తీగా కనబడుతూ ఉన్నది. జనానికి అలా ఉండటం అలవాటు లేదు. వారికి మానసిక శ్రమ కలిగింది. అంతా క్రొత్తగా ఉన్నది. అయితే వాళ్ళకు ఇబ్బందులేమీ కలుగలేదు. నేను రోజూ సైకిలు మీద ఒకసారి వెళ్ళి అంతా తిరిగి చూచి వస్తూ వుండేవాణ్ణి. మూడు వారాలపాటు ఈ విధంగా తెరపగాలిలో వుండటo వల్ల వాళ్ళ ఆరోగ్యం బాగు పడింది. మానసిక కష్టం మొదటి 24 గంటలు మాత్రమే ఉన్నది. తరువాత అంతా సంతోషంగా వుండసాగారు. నేను వెళ్ళినప్పుడు అంతా భజనలు చేస్తూ, కీర్తనలు పాడుతూ ఆటలు ఆడుతూ వుండేవారు.

లొకేషను ఖాళీ చేసిన తరువాత రెండవ రోజున లొకేషనును తగులబెట్టారు. అక్కడి వస్తువుల్లో ఒక్క దానిని కూడా మిగిల్చి వుంచాలనే కోరిక మునిసిపాలిటీ వారికి కలుగలేదు. ఈ నెపంతో తమ మార్కెట్టులో గల కలపనంతటినీ కూడా తగులబెట్టారు. అంతా కలిసి పదివేల పౌండ్ల సొమ్ము నష్టమైంది. మార్కెట్టులో చచ్చిన ఎలుకలు పడివున్నాయి. అందువల్లనే అంత భయంకరంగా లొకేషనును తగులబెట్టారు. ఖర్చు బాగా అయింది కాని వ్యాధి మాత్రం అంతటితో ఆగిపోయింది. నగర ప్రజల భయం తొలగిపోయింది.

18. ఒక పుస్తకపు అద్భుత ప్రభావం

ఈ ప్లేగు వ్యాధి బీదవారైన హిందూదేశస్థుల్ని గురించి నా పనిని, నా వృత్తిని, నా బాధ్యతను బాగా పెంచివేసింది. యూరోపియన్లతో నాకు పరిచయం బాగా