పుట:సత్యభామాసాంత్వనము.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

81

క. చూచిన నన్నను మనసునఁ
     జూచుటయే కాక పోయి చూచుట యెపుడో
     యాచంపకాంగికైపులు
     నాచూపు మెఱుంగుకోపు లానగువైపుల్.

ఉ. దానిహొరంగు దానిజిగి దార్కొనుచెక్కులరంగు దానినె
     మ్మేనినలుంగు దానితొడమించుబెడంగును దానినవ్వుపు
     వ్వానమెఱుంగు దానిబిగివట్రువగుబ్బలపొంగు నెంచినన్
     మానస మయ్యయో మరునిమాయలఁ జొక్కెడి నేమి సేయుదున్.

సీ. పక్కవాటుగఁ గొంత పడ కిచ్చి తమి నెచ్చి
                    కసివోక లె మ్మని కొసరునేర్పు
     ఉబికి పెందొడ లెక్కి యుదుటు గన్పడ నిక్కి
                    యొడికట్టు గదియించు నుబ్బరంబు
     ముద్దిచ్చి లాలించి మొనగుబ్బ లానించి
                    [1]బిఱబిఱ గమకించు నెఱతనంబు
     పొగ రాని తెగఁబూని పొగడపూవిలుకాని
                    [2]జోడన ల్గొనియెడి కోడిగంబు
తే. కరఁగి కరఁగించి రతులయక్కఱలఁ గెరలి
     తనిసి తనియించి చెమటచిత్తడిని దడిసి
     సుడిసిపడి చల్లఁగా వ్రాలుసుదతిమేలు
     మఱచెద నటన్న నిఁక నేను మఱవలేను.

ఉ. కొప్పునఁ బూలు చెక్కి వెడకోపము దీరఁగ మ్రొక్కి తేనియల్
     చిప్పిల మోవి నొక్కి నునుచెక్కిలి ముద్దిడి తక్కి వేడుకల్
     చొప్పడ నొక్కి చక్కి తమిఁ జొక్కి కవుంగిటఁ జిక్కి చక్కి యా
     యొప్పులకుప్పచొ ప్పెఱిఁగి యూరటఁ దేరుట లింక నెన్నఁడో.

క. కాంత చిఱుప్రాయమున నే
     నంతిపురిం జేర నరుగునప్పుడు తా నా

  1. చిఱుసన్న లెడలించు
  2. జాడ నన్గొనియెడి