పుట:సత్యభామాసాంత్వనము.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

75

మ. మహిసంక్రందన, [1]క్రందనందనసుమన్మందార, మందారదు
     స్సహసంస్పర్శన, స్పర్శనాతిగదయాసద్భావ, సద్భావన
     న్మహిళాభావిత, భావితార్కభుజసీమాధామ, మాధామవి
     ప్రహితాలోకన, లోకనవ్యనయనాభాచంద్రభూచంద్రమా.

క. కరుణావరుణాలయ నత
     భరణా శరణాగతారిపార్థివ సుగుణా
     భరణా వరణాంచితపుర
     తరుణా యరుణాబ్జసద్రుతాయతభరణా.

క. ద్రాక్షాశిక్షానుక్షణ
     రక్షాక్తీకృతవినోదరక్షితపక్షా
     లక్షణలక్షితవీక్షా
     దక్షిణసింహాసనేంద్ర దయితకవీంద్రా.

మత్తకోకిల.
     ప్రాక్కుటీవిజటీనసాదరపద్మభూభుజగాదరా
     ధిక్కృతార్యమహోభరాధరతీక్ష్ణఖడ్గరణోదరా
     న్యక్కృతారిధరావరా దరహాసగమ్యసరాదరా
     చొక్కనాథనృపాలసోదరస్ఫూర్తితామరసోదరా.

  1. క్రందనందితసుమ