పుట:సత్యభామాసాంత్వనము.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

39

తే. యెడనెడను నావులింతలఁ బొడముతప్పు
     దీర మన్మథ మకరాంక మార మదన
     మనసిజ మరుద్రథ రమాకుమార యనుచు
     వెలయు విటతాపసులసేన వీటిలోన.

ఉ. వేఁకటిచింత యంత మది [1]వింతగ నెమ్మెయిఁ గప్పుగప్పుతో
     నాఁకటి కానవా ల్ఫలము లన్నము చేటిక లాని రాఁగ నున్
     గూఁకటిఁ గల్వపూ ల్దురిమి గుబ్బలఁ గస్తురిఁ బూసి జారులం
     జీఁకటినేస్తపుంజెలులు చేరుదు రప్పురి దాదియిండ్లలోన్.

మ. ననుపున్ బాపులు చూడ నైదువలు శ్రీనాథాజ్ఞ నెంతే నెదు
     ర్కొన బంగారపుపావలన్ దిగి, నునుగుబ్బల్ బయల్దేరఁ గా
     ల్వనుసారింపుచుఁ దాళిగట్టు జనుచేలా కౌనునీటాని కొ
     ల్వునకున్ వత్తురు రాయబారపుఁజెలుల్ కోటానగోటుల్ పురిన్.

సీ. పాకారిణిమకృతప్రాకారములమీఁద
                    రారాలబసువనిబారు చెలఁగ
     గోపురాంతస్సీమ నూపురారావంబు
                    లమర బోగముకన్నెగము లెసంగ
     గోపనామాదత్తధూపవాసనలచేఁ
                    దమ్మిపూమేల్కట్లు ఘమ్మనంగ
     భద్రానువాదకరుద్రానువాకముల్
                    పఠియించుపారులప్రౌఢి వెలయ
తే. నందుఁ జెలు వొందు నందిహస్తారవింద
     వేత్రవిత్రస్తగీర్వాణవితతి యగుచు
     శైలరాజన్యకన్యకాశంకరులకు
     దావళం బైనయొకపైఁడిదేవళంబు.

శా. ఉల్లాసం బొనగూడ జగ్గునడతో నొయ్యారపుంజూపు లు
     ద్యల్లీలం దగఁ జేతు లెత్తి బసపుందళ్కొత్తు పాలిండ్లతో

  1. వింతగ హెచ్చగుఁగప్పురంబుతో