పుట:సత్యభామాసాంత్వనము.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

35

     దారవనీగౌరవనీ
     హారవనితవంచి కీర్తిహారిగుణునకున్.

క. దీపితతేజఃస్థితికిన్
     బ్రాపితవిజయేందిరానియతికిం గరుణా
     శ్రీపతికి ముద్దువీర
     క్ష్మాపతిముద్దళ్ఘరిక్షమాతలపతికిన్.

వ. అభ్యుదయపరంపరాభివృద్ధిగా నాయొనర్పంబూనిన సత్యభామా
     సాంత్వనం బనుమహాప్రబంధమునకుఁ గథాక్రమం బెట్టి దనిన.

శా. శ్రీశుం డానరకాసురున్ గెలిచి రాచెల్వ ల్పదార్వేలు పే
     రాశం గూడఁగ నల్గుసత్య నెటు లూరార్చేలె నాసత్కథన్
     ధీశక్తిన్ జనమేజయుం డడుగఁ దా నెక్కొన్నమోదంబుతో
     వైశంపాయనుఁ డి ట్లనెన్ మధుసుధావాదప్రవీణోక్తులన్.

క. శ్రీపురహరరథరమణీ
     నూపురమై కల్మిపడఁతి నుడికొమ్మలకున్
     కాఁపుర మై సొబగుల నల
     [1]కాపుర మని యనఁగ ద్వారకాపుర మలరున్.

ఉ. ఆపురమందుఁ గెంపుజిగియందపుకోట పయోధికన్యకుం
     బ్రాపగుతమ్మిపోలికను భాసిలెఁ గొమ్మలు రేకులట్లు చా
     లా పరఁగున్ దదంతరగళన్నవమౌక్తికలీల నబ్ధివీ
     చీపృథుశీకరమ్ము లెనసెన్ హరిసేసలు చల్లుకైవడిన్.

మ. పురసౌధాగ్రములందు రాసుతులతోఁ బూఁబోండ్లు కందర్పసం
     గరముల్ సల్ప [2]నెసంగు లేసకినకూనల్ వైజయంతంబునన్
     దిరుగుంగూకికవల్ రహి న్వినుచు వానిన్ నేర్చి వాక్రుచ్చు బ
     ల్మఱు సేబా సని వేల్పుఱేఁడు నగి చాలా నచ్చరల్ మెచ్చఁగన్.

  1. కాపుర మై తనరు ద్వారకాపుర మలరున్
  2. నెసంగ వేసరిలికూకల్