పుట:సత్యభామాసాంత్వనము.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

సత్యభామాసాంత్వనము

     సకలవిద్యాప్రౌఢి సర్వజ్ఞుఁ డితఁ డౌట
                    నెనిమిదికలుముల కేమి హెచ్చు
తే. బళిరె మజ్ఝారె యని జనుల్ ప్రస్తుతింప
     ధనకనకధాన్యవస్తువాహనసమృద్ధి
     వెలయు నానందముగ ధాత్రి వీరనృపతి
     [1]కరటిశరభండు ముద్దులళ్ఘరివిభుండు.

షష్ఠ్యంతములు


క. ఏవంవిధ సద్గుణమణి
     [2]కావలయాంచద్ధరావరాంగీహీర
     గ్రైవేయకాభిశోభి య
     [3]శోవిలసితధవళఘృణికి శూరాగ్రణికిన్.

క. సంధాభృగునందనున క
     బంధనగంధవహబంధుహితతేజోని
     ర్గంధితగంధాంధరిపు
     స్కంధావారాంబునిధికిఁ గవిసేవధికిన్.

క. నాభాగసమున కంబుజ
     నాభాగమబోధధుర్యునకును హరిన్నా
     నాభాగినటితకీర్తిఘ
     నాభాగరిమాతిశయున కధికజయునకున్.

క. ఆంధ్రవచోనాథునకుఁ బు
     రంధ్రీపాంచాలునకుఁ గరధృతాసిలగ
     త్కంద్రపరిపరిపంథిపార్థివ
     రంధ్రితదినమణికి మతిధురంధరఫణికిన్.

క. ఘోరమహోదారమహో
     దారమహోన్నతతరాబ్ధిహతచణునకు మం

  1. కరటికలభుండు
  2. కావలయాచలధరావరాంగీహీర
  3. శోవిహసితశీతఘృణికి శూరాగ్రణికిన్