పుట:సత్యభామాసాంత్వనము.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

19

     శ్చలగతి ముద్దువీరసృపచంద్రుని శాశ్వతకీర్తిసాంద్రు ని
     ర్మలతరధీరతావిజితమందరు నిర్మలభూపురందరున్.

క. ఆ ముద్దువీరనరపతి
     భూమండల మేలెఁ గమఠ భుజగవిభు కిరి
     గ్రామణ్యష్టదిశాకరి
     సామాజిక[1]సార్వభౌమసారోన్నతుఁడై.

సీ. జాతిమాలిన యవ్వసంతుండు వివరింప
                    సాటియే సౌందర్యసారమునను
     రీతిమాలిన యల్లజాతరూపనగంబు
                    సాటియే యనుపమస్థైర్యమునను
     నడకమాలిన యల్లనందనవనశాఖి
                    సాటియే నిర్ణిద్రచారుకీర్తి
     దెలివిమాలినయట్టి [2]తొలుకరి క్రొమ్మొగుల్
                    సాటియే సతతవిశ్రాణమునను
తే. ననుచుఁ దను జను లందఱు నభినుతింపఁ
     దనరె దుర్దాంతసామంతధరణికాంత
     సంతమసశాంతి పటుధామ చండధామ
     విదితజయహారి శ్రీ ముద్దువీరశౌరి.

చ. అనికయి వచ్చి క్రోధరస మానినడాలున నేలుశాత్రవా
     ననములు పద్మముల్ దనరు నవ్యకిరీటమణుల్ పరాగముల్
     గొనబుగ వెల్వడం దనదు కోటిమరందరసంబు ముద్దుకృ
     ష్ణనృపతి ముద్దువీరనరనాథుని ఖడ్గమిళిందరేఖకున్.

చ. అలనరనాథుతమ్ముఁ డఖిలారిభయంకరచారుమూర్తి య
     త్యలఘుశుభానువర్తి ధవళాంబుజకార్తికచంద్రచంద్రిగా
     విలసనభవ్యకీర్తి గుణవిశ్రుతి నేడవచక్రవర్తి వ
     ర్తిలె నిల నిర్మలప్రభువరేణ్యుఁడు సత్కవిలోకగణ్యుఁడై.

  1. సారబాహు
  2. తొలుకారు