పుట:సత్యభామాసాంత్వనము.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

సత్యభామాసాంత్వనము

క. కాకులవలె నింటింటను
     కాకవు లున్నారు హంసకైవడి భువిలో
     శ్రీకామ నీకె తగురా!
     యేకడ నుడి పాలు నీరు నేర్పఱుపంగన్.

క. ఏభాష నైనఁ గృతిపతి
     శోభనములఁ జెందు నీదుసూక్తులవలనన్
     నీభాగ్య మసదృశము గౌ
     రీభవకరుణానివేశ శ్రీ కామేశా.

వ. అనిన విని తదాజ్ఞానుమతి నే నంగీకరించిన నతండు సబహు
     మానంబుగాఁ గర్పూరతాంబూలకనకచేలకమనీయరత్నాభరణస్తోమ
     గ్రామప్రదానంబుల నానందంబు డెందంబునఁ గ్రందుకొన నొనరించిన:

తే. తనదు దక్షిణనాయకత్వమున కుచిత
     ముగను ముద్దళఘరిశౌరి ముదము మీఱ
     నాటి రుక్మిణిపరిణయం బందుకతనఁ
     దా నిపుడు సత్యభామసాంత్వనముఁ గోరె.

క. అదితికబలె శ్రుతి షణ
     మొదవింతు బుధాళి కనుచు నొగి శ్రీపతి నె
     మ్మది ముద్దళఘరి యనఁ దగి
     సదయత మణి సత్యభామసాంత్వన మెంచన్.

వ. అనుచు ననుచు వెనుక నతని యింగితం బెఱింగి సంగరాంగణా
     భంగురనిజవిజయరమాసౌమాంగల్యసంధాయకు, నపారకృపారస
     పోషితకవిగాయకు, నాశ్రితజనాభిమతార్థదాయకు, ముగ్ధవధూకుసుమ
     సాయకు, ముద్దళఘరిభూనాయకుఁ, గృతినాయకుం జేసి నే నేర్చినవగ పడె
     దీర్చి తీర్చినపన్నీటిసాటితేటమాటలు చేర్చి కుపితనాయిగాసాంత్వనపర
     గోపాలకానల్పకల్పమంజరీసంజరీజృంభమాణసౌరభమ్మువిధమ్మున దిననిగమ
     సమయ......[1]నిన.....[2]వీషుజులపటలలోలుఠ....[3]ద్విధ్వంకురపరిగళదమృత

  1. గ్రంథపాతము
  2. గ్రంథపాతము
  3. గ్రంథపాతము