పుట:సత్యభామాసాంత్వనము.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

141

క. వి ల్లందుక శరధారలు
     మల్లడిగొనఁ బల్లవోష్ఠి మార్తురసేనల్
     చెల్లాచెదరుగఁ జేసెను
     భల్లా [1]బడెసాయ బనుచుఁ బతి నుతియింపన్.

సీ. కంకణక్రేంక్రియల్ కటుచాపటంక్రియల్
                    చిఱునవ్వుమెఱయింపు జేవురింపు
     కలవాగ్విరావముల్ కహకహారావముల్
                    గొల్లన నగుముద్దు గొరకసద్దు
     సరససల్లాపంబు సంగ్రామకోపంబు
                    వింతసొగసుఢాక వెగటు కేక
     సొంపుమీఱినవైపు చుఱచుఱ మనుచూపు
                    బులుపులు తగునంగు పొగరుపొంగు
తే. సరసశృంగారవీరరసంబు లమరు
     కొమరు తగి యుండ మెయిఁ జిఱుచెమట నిండఁ
     బోరు గావించె రిపుసేన బో రనంగఁ
     గల్లవగగొల్లదేవేరి కడఁక మీఱి.

వ. అపుడు.

క. గొనయమ్ము దివిచి కోమలి
     గనయముఁ జిమ్మఁగ నురోజుకలశమ్ములత
     గ్గును హెచ్చుఁ జూచి కుతుక
     మ్మున హరిహృదయమ్ము వెనుకముందై యుండెన్.

సీ. సంవర్తకీలియై చంద్రికాపాళియై
                    కనుగెంపు నగుపెంపు గ్రక్కతిల్లఁ
     బటుకాలదూతియై పంచాస్త్రుహేతియై
                    చాపంబు రూపంబు సంఘటిల్ల

  1. బడెసాహె బనుచు