పుట:సత్యభామాసాంత్వనము.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

140

సత్యభామాసాంత్వనము

క. ఆలంబునకై యిటువలె
     మేలంబున లేవఁ దగవె మెలఁతలు చేసే
     జాలమ్ము లేమి చెప్పుదు
     వాలమ్ములయేట్లు విరులె వనజదళాక్షీ.

సీ. కేళీగృహకపోతకివకీవారవములా
                    యమరారిఘోరకాహళరవంబు
     సహచరీసాకూతసల్లాపసరణులా
                    నాసీరదరిసింహనాదసరణి
     బాలికాపరిచితడోలికావిహృతులా
                    సమరయాతాయాతగమనవిహృతి
     భర్మపాంచాలికాపరిణయరీతులా
                    రిపుసౌరకాంతాపరిణయరీతి
తే. యకట యే మందు నిందీవరాక్షి వికట
     సురవిమతసేనలను దేఱి చూడవశమె
     తెలిసినను కన్నకార్యంబు తెలియకున్న
     జానలకు నెందు సహజంబు సాహసంబు.

కం. [1]రామా మే మానిక కిట
     [2]రామా రా మాటవాసి రా మానవుఁడా
     [3]రా మానునె రణమున గా
     రామాయని చెలికి రామరామా తగునే.

క. అనిన విని మత్తకాశిని
     తననాయకుచేతిధనువు దాఁ జేకొనెఁ గా
     మునియంపఁ బూనురతిరే
     కను మృడుచే నొడియునల్లగౌరియుఁబోలెన్.

  1. రామా వేమారక కిట
  2. రామా నా మాటవాసి
  3. రా మానునె రణ మన గా