పుట:సత్ప్రవర్తనము.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్ప్రవర్తనము.

61


పుటము పెట్టినంగాని బంగరు వన్నె మంచి వెలుంగదు. పాపము! తన తండ్రి ఋణములు తీర్పుచుండునపు డాతనిమోమునం దోచు వైవర్ణ్యము శ్రమంపడి యార్షించినవిత్తము దుర్యయమునకై ఋణమున కిచ్చునప్పుడు చేతులు వడుకుటయుఁ గాంచి తన తెలివితక్కునను బలుసారులు నిందించుకొనియెను. ఇంక ముందెట్టి చెడు కార్యములను చేయనని యెట్టు పెట్టుకొనియెను. ఉత్తసుద్దులు సుంతము గోరంఎతగాక యుండ దమ విత్తముం బట్టుకొని పోయిరి. ఇంక గుముదవల్లీ లో ఋణము లేదని స్పష్టము కాగా నామధుసూదన రాజానాఁడు తల యంటుకొని స్నానము చేసెను. నేలకు వేలుగా నిట్లప్పు తీర్చిన వారెవ్వరు లేరని యెల్లరును జెప్పుకొన నసారి. నాఁడు కడుపునిండ భుజించి కంటినిండ నిద్ర పోయెను,

వారము లెనము లిట్లు కాలము గడువఁగాఁ గుమారుడడకవ గలిగియున్న వాడనియుఁ దనయని పే చర్యలు దానెఱింగి లజ్జించుచున్న వాడనియుఁదండ్రియెరొంగెసు. తల్లి గాని తండ్రి గాని యొక్క మాటయైన నాతని ననక యథా పూర్వ వాత్సల్యమున నాతనిని రక్షించుచుండిరి. శుముదపల్లి మిత్రులు వచ్చిరి గానీ సూర్యనారాయణవర్మ వారితో నంతప్రియముగా మాటలాడ లేదు. విధి లేక మాటలాడినట్లు నటించెను. వారును హతాశులై పోయి, ఈతనిచే ధనము విశ్లేషించి వ్యయము చేయించిన సుపహారమిత్రులు పత్రికామూలమునను గూఢచారుల మూలమునను వార్తలంబంపిరి గాని వర్మ తన యజ్ఞానచర్యలకు లజ్జిం చుచుండుటంబట్టి బదులిడకయు నిచ్చిన ననిష్టమును సూచించుచు వారిపొందు తనకక్కఱ లేదని స్పష్ట పఱచెను. ఆతఁడు మదిలో సీతారామరాజుతో మైత్రి సంపా