పుట:సత్ప్రవర్తనము.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

సత్ప్రవర్తనము.

 యానందమున నంతకంటే భాగ్యము గలదా యని బదులిచ్చెను. "ఇపుడు వలదు, సమయము వచ్చును. ఇచ్చట గొన్ని శ్రమము లనుభవిషవలసి వచ్చును. కాని యాయను భవము సుఖములకు మార్గము చూపు” నని దాసు పలికెను. మఱికొన్ని మాటలు జగిన పిమ్మట రాజు నెలవు గైకోని యింటికిం బోయెను, ఆసువార్త సుశీలకుం దెలుపు నామె నానూటను గొడుకు జవిలో బడపైచెసు, సీతారామరాజు సుపమయు మద్దాని కెపుడువచ్చునో యనియు నేల యాముని యిట్లగ్నాపించనో యనియుం దలపోయుచుండెను. ముందుగా యోగి తెలిపినఁ బిండి వంటలు సిద్దము చేసి యుంతుననియు వాని సాయమువం చిరంజీవి వారము దినములు మునికడ భోజనమున బాధపడక యుండఁగలడనియు భర్తకు దెలుపు చుండెను. ముని కడ సుండువారలకు బాధలుండునా యని భర్త పలికెను. అది తోపకయే యీయాలోచనము చేయుచున్నానని సుశీల తెలిపెను. వారు యెపుడు వచ్చునో యని వారిరువురును "వేచియుండిరి.

కనకవల్లిలో నాల్గుదినములు సూర్యనారాయణవర్మ యుండెను, తండ్రి, కుముదవల్లిలోని వర్తకులు లోనగువారికి గొడుకీయవలసిన ద్రవ్యమంతయు నిచ్చి వేసెను, ఆయాదిన ములలోఁ దాను దీసికొన్న వస్తువుల పేరులు వారు తెల్పుచున్నప్పు డెల్ల నావర్మగుండెలు వడఁకుచుండెను, తనదుశ్చర్య యిట్టిదని యాతనికి జక్కఁగాఁ దోచెను. ప్రతిక్షణమునందును మార్పునొందుచు నాతని మంచి మార్గమునకు జేర్చుచుండెను.

ద్రవ్యమెంత ..... .... ........ చుండెను. ఇన్ని చింతలు నాతని బాగు చేయఁ జాలు నవియే..