పుట:సత్ప్రవర్తనము.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

సత్ప్రవర్తనము.


అదేమి కాలమాహాత్యమో కానీ దాసు సుస్మితముఖుండై “రాజా! చింతింపకుము నీకొడుకు దుడుకుదనము తొలంగును. క్రమముగా మతిమంతుఁడై వంశకర్తయగును. కాని యాతని నాకడకుఁ దోడి తెచ్చి విడిపించి నీవరుగుము " అని పలుకఁగనే యా మధుసూదనరాజు పరమానంద వార్లితరంగముల నోల లాడుచు నిది నాయదృష్టమే యనుకొనుచు "మహాత్మా! నన్ను ధన్యుని జేపితిరి. నాకులము పావనమయ్యెను. నానోములపంట యా యొక్క డే. అతఁడు దుర్వినీతుఁడగుటం జేసి వెతలం గుడుచు చుంటిని. తమ యమోఘవాక్కు నన్ను దరించెను.” అని "మొక్కి సెలవంది కనకవల్లీకిం బోయెను. మధుసూదనరాజిల్లు చేరఁగనే యెల్లరు వచ్చి యా తొలిదినమున సాగిన పాఠశాలోపన్యాసమును దెలిపిరి. దాస నాతనిచిత్తము వ్రయ్యలయ్యెను. నిశ్చేష్టుఁడై కొంత సేపుండెను. విచారసాగరమున మునింగినట్లాతని మోము తెల్పుచుండెను. కొంత సేపు మాటాడఁజాలక యుండి యోగి 'వర్యుని మాట తలంపునకు రాఁగాఁ గొంత మదిని దీటవు పాదుకొల్పి కొడుకు దుర్లయముల సడిగి తెలిసికొని యెట్లో యోపికఁబూనుఁడు. వానిని మంచి మార్గమునకుఁ దిప్పువారు కలరు. నా పైఁగల విశ్వాసమున నీపు డోర్చియులడంఁడని యెన్ని యోభంగులం బార్ధించి వారిని సాగనం పెను

, ఇంతలో నొక. బేహారి యరుదెంచి మధుసూదన రాజు 'గారూ! మీకొడుకు మాకడం గొన్ని సరకులం దీసికొని కొన్ని నెలలాయె. సొమ్మియ్యక యదిగోయిదిగో యనీ కొలముఁ ద్రోయుచున్న వాఁడని లెక్కలఁజూపెను. 'పరిమళ వస్తు వ్రాత మదినమునకు వృద్ధితో మూఁడువందలు పైఁ బందొమ్మిది