పుట:సత్ప్రవర్తనము.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్ప్రవర్తనము.

49


రజత ముద్రికలని తేలెను. ప్రతిసారియు సంతకము చేసియే యుండుట నంద న్యాయమేమియు సాగ లేదని యెఱింగి లేని సంతోషమును దెచ్చుకొని రేపు వచ్చి సొమ్మిత్తుసు అని 'మెల్లగా వారిని సాగనంపెను. ఈవిషయమును భార్య కెఱింగించుచుండ నింకొక వర్తకుఁడే తెంచి ఫలాహార వస్తువులు దీసికొన్న పద్దులం జూపెను, ప్రతిదినము పది రూక్ష్యములకు దక్కువగాకయుండ నవి యుండెను మిత్రులతో వచ్చి పుచ్చుకొన్నయట్లు వారు తెల్పిరి. ఆ మొత్తము సుంత తక్కువగా నేడు వందలపై ముప్పదియాఱు రజతముద్రికలుగా నుండెను. అచ్చెరువందుచుండఁగా నొకరి వెంట నొకరు వచ్చి కొన్ని యప్పులను దెల్పిరి. ఆనాటికి వారు తెలిపిన ప్రకారము 'రెండు వేలు నాఱువందలు డెబ్బది యెనిమిది రూప్యములు ఋణము తేలెను. ఇంత ధనమగువఱకు నా కేల తెలుపు వైతిరని పశ్చించిన యారాజునకు మీకుమారుఁడని మారాడక యిచ్చితిమను బదులు వచ్చెను. ఇక మాటాడ రాదని త్వరగా బంపుదునని చెప్పి వారిని సాగనంపి సాధ్యితో నీవిషయము తెల్పి యోగిమాటలు తప్ప నూఱటఁ జెందఁదగు విషయమే లేదని నిశ్చయించు కొనియుండెను.


మఱి కొంత సేపటికాత్రోవన సీరామరాజు పోవు చుండెను. పాఠశాలనుండి వచ్చుచు నింటి కేగుచున్నయట్లగపడియెను. ఆవఱకెన్నండు నాతనింబిలిచి మాటలాడినవాడు కాడు. కావున నించుక సంశయించుచు విధిలేక లేచి వచ్చి నాయనా ! సీతా రామరాజు ! అని పిలిచెను ఆపిలుపు చెవులం బడిన తోడనే నిలువుబడి నమస్కారము చేసి మెల్లగా వచ్చి