పుట:సత్ప్రవర్తనము.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్ప్రవర్తనము.


తురు. 'భిన్న రుచిర్హి లోకం ' అనుట ప్రసిద్ధ మే కదా. ఆకుండికకు నాలుగు ప్రక్కలయందును శీతల ద్రుమములు మాత్రమే యుండెను.


వేసవి కాలములం జాచెంత గ్రామములయం దుండువారచ్చటికిం బోయి పదిదినము లుండి స్నానము మూఁడు వేళలఁ జేయుచు నావృక్షముల, కింద పంట చేసికొని భుజించుచు యోగిని దర్శించుచు పోవు నుందురు. ఆ యోగిని భగీరథ దాసని యెల్లరుం బిలుతురు. ఎవడేని తమ పేరేమని యడిగిన చిఱునవ్వునే సమాధానముగా నామముని చెప్పు చుండును. పలుసారులు ప్రశ్నించి యాతనినోటినుండి యొక మాటను బలికింప నెవ్వరును ప్రయత్నించరైరి. ఆముని మిత భాషణుఁడు, సర్వకాలము భగవద్ధ్యా సమున నిదుగ్ను డై యుండును. ఎప్పుడో యించుక మాటలాడును. ఆకొలది గడియలు సంశయముల నడుగఁదలచువారందురు కాని కాక దంతపరీక్షగా సనవసరముగాఁ బశ్నించువా రెవ్వరుందురు? ఒకప్పు డెవ్వండైనం బశ్నించునే నా యోగి యూరకుండును. ఎవ్వరు నా యోగికి ధనమిచ్చు నలవాటు గలిగించుకొన రైరి. అప్రతిగ్రహీతయని యాయనకుఁ బ్రఖ్యాతి కలదు. ఫలముల నిత్తుమన్న నన్నియు నావనమున నున్నవియే. కొందఱు దాన కర్ణులు మహాభక్తి మెజియించుచు నాలుగుపండ్లు కోసి తెచ్చి యిచ్చుచుందురు. ఆముని వాని నెవరి కే నిచ్చునుగాని తానార గింపఁడు. తానే పోయి మధ్యాహ్న మునఁ జేయఁదగు క్రియల నొనరించిన పిదకు ఫలములను గోసికొనివచ్చి భుజించుసు. ఇతరులకు శమము గలిగింపవలయునన్న యూహాయే యాయోగికి లేదని యిందువలన మనకుఁ దెలియవచ్చును.