పుట:సత్ప్రవర్తనము.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

44

సత్ప్రవర్తనము.


భూగోళమున "నేయే భాగముల నేయఫలము లుండునో అవియెల్ల నందుండుననుట వాస్తవము, పుష్పవృక్షము లట్లే యందుండును. లతాకుడుంగములు గలవు. ఛాయామహీరు హములు కూడ నందుఁ గలవు. అవి నాలుగు పక్కల విశే షించి యుండును. అందందును గానఁబడును.


ఇట్టులుండియు సయ్యది యడవియను పేరునుమా తము పోఁగొట్టుకొనఁ బ్రయత్నిం పడయ్యెను. నందనవనమనియో, ఖాండవమనియో, చైత్ర రథమనియో, మఱియు సుందరా రామమనియో పేరు పెట్టఁదగియుండెను. ఆవనముననొక యోగి యాశ్రమమును గల్పించుకొని యుండెను, దానినడుమ పార్ణశాలయుండెను. దానికి దక్షిణపుఁ బక్కన నొక జలాశయము గలదు. దానికించుక యగ్ని మూల నొకకుండిక కలదు, ఆకుండి కకు మార్కండేయ తీర్థమని పేరు. అర్ధచంద్రాకారముగా వయ్యది యమరియుండుట చేత గుండిక యనంబడియెనని కొందఱందురు. అది యగాథమను ఖ్యాతిగాంచెను. అందు జల జంతువులు విషేషించి కలవుగాని పాములు, మొసళ్లు, కర్కాటకములు మాత్రము కలికమునకుంగూడ లేవు. అదియే మార్కండేయుని యను గ్రహమని కవులు వర్ణింతురు. దూరమాలోచింప - నేదోయొక కారణము గలుగకయవి లేకుండనుండు నవశాశము లేదని పెక్కండ్రూ హింతురు. దానిజలము యమునోదకముం బోలియుండును. లోతుగా నుండుట చే నట్లగుడును గాని జలములకు రంగు లేదని పౌరాణికులు వాకొనుదురు. స్థలము ననుసరించి రంగుగలుగుననుట నిక్కువ మని యెల్లరంగీకరింతురు. తెల్లని రంగుగల భూమిని నీలవర్ణము గల నీరుండఁ గారణ మేమని మఱి కొందజు పైవారిం బ్రశ్నిం