పుట:సత్ప్రవర్తనము.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్ప్రవర్తనము


కూడఁ గొన్ని దినములయుఁ జదివింపఁ దలంచసాగిరి. బాలికల సంఖ్యయు వరుసగా హెచ్చ సాగెను. అది దేశాభివృద్ధికి మూలమనీ యుపొధ్యాయులు నొక్కి చెప్పుచుండిరి. బాలికలకు విద్య కొంచెము వచ్చినను బహుమతులు గొప్పగా దొరకు చుండెను, బహుమతుల వారు " నుతతంగరతాళధ్వను లంబకమును బద్దలు చేయుచుండెను. ఆ బాలికల బంధువులు తల్లిదండ్రులు పరమానందము నొందుచుండిరి. ఆబాలికలకుఁ దగినవరులు విద్యాధికులే కావలయునని తల్లిదండ్రులు వెదకుచుండిరి, వారిం 'బెండ్లియాడఁగోరి కొందఱు చదువుచుండిరి. తఱుచుగా నా పొఠశాలయందే చదువువారలే. వారికి బతులగుచుండిరి. అది చాల వినోదముగా సుండెను. ఈ యలవాటు చుగా నుండ సాగెను.


కనకవల్లి యందుండు రాజకుటుంబములలో సరపతులను నింటి పేరు గలవారు మర్యాదచే జీవించుచుండిరి. విశేష ధనవంతులు గారు. కాని యన్న వస్త్రములకు లోటు లేక వారు కాలముపుచ్చుచుండిరి. రామచంద, రాజు తత్కాలమున నా కుటుంబమున కధికారిగానుండెను. అతనికి సుశీలయను సాధ్వి ధర్మపత్ని గా నుండెను. కొంతకాలముదనుక వారికి సంతతి లేకుండి భగవదసు గృహమున నొక్క కుమారుఁడు కలిగెను, సీతారామరాజును నామ మాతనికిఁ బెట్టఁబడియెను. గారాబు బిడ్డఁడు గాన నతి ప్రీతితో వారు పెంచిరి. శుక్ల పక్షమున విధీయ నాఁటిచంద్ర బింబమువలె వృద్ధినొంది యే డేండ్ల వయసు గలం' పొండయ్యెను. ఆయీడునకుఁ దగినట్లు విద్యవచ్చెను. ఉపనయ నము: బ్రాహణుల యాచార ప్రకార మేడవ యేటఁ జేయఁబడి