పుట:సత్ప్రవర్తనము.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

10

సత్ప్రవర్తనము


యెను. అది వారియింటి యాచారమగుటఁ దక్కుంగల రాజు లాక్షేపింపరైరి.


సీతారామరాజుప సయనానంతర మా పాఠశాల కే పంపం బడియెను. కనకపల్లి కది. కడుదూరమున నుండక యించుక దగ్గఱగా నుడినందున విద్యార్థులు తమయిండ్ల భుజించియే వెళ్లుచుండిరి. సీతారామరాజు సుందరమగు నాకృతిఁ గలిగి యుండువాఁడు, మోము లావణ్యతమముగా నుండును. కన్నులు విశాలములై హరిణనయనముల గేలిచేయుచుండును, తక్కిన దేహ భాగము లన్నియు సాముద్రిక శాస్త్రమునఁ జెప్పఁబడినచందమున నుండుటం జేసి యుత్తమపూరుషుఁడగు నని తెలుపుచుండెను, పెక్కం డాకుమారుం దిలకించి రూప వంతుడే యని యొకరినొకరు తెలుపుకొనుచుండిరి పురంద్రీ మణు లాతనింగని చక్కని బాలిక యీకని బెట్టపట్టవలయునని యాశీర్వదించుచుండిరి. తల్లిదండులు మాపిల్ల వానికి సకలవిధ ములఁ దగిన కన్యక దొరకునా యని యాశీంచుచుండిరి

. సీతారామ రాజు పుస్తకముల దీసికొని పాఠశాలకు, బోవుచు నిటునటు చూడక యేదో యోజించుకొనుచుఁ బోవువాడు కొందఱు బాలురు నలు పక్కలం జూచుచుఁ గుంటివారిని, గుడ్డివారిని, జెవిటివారిని, సంగహీనులను, గుష్టువ్యాధి. బాధితులను గని నవ్వుచు గేలి సేయుచుఁ దొలఁగి పొండని చెప్పుచుందురు. అట్టి దురబ్యాస్యము లీ బాలునకు బట్టుపడ లేదు. పూవుతోడ నే పరిమళ ముదయించి యది వృద్ధి కొందు కొలది నదియుఁ బెరుగును గదా! అట్లే మానవుఁడు జన్మించిన తోడ సే యంకురించిన గుణములు వరుసగా నభివృద్ధి