పుట:సకలనీతికథానిధానము.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము


తే.

యొ(కఁడు ఘు)టి కిచ్చి విప్రుని నువిద జేసి
నృపతిముందట నిది నాకు నిజతనూజ
తీర్థయాత్రకు జని యల్లుఁ దెచ్చుదాక
(పోషణ)ముచేయుమని చెప్పి పోయె నతఁడు.

222


క.

ఆరాజన్యుఁడు నాత్మకు
మారికకడ నిలుప రాత్రి మగవాఁడై యా
వారిజలోచనఁ బొందును
సూర్యోదయ[1]మైన మగుడ సుందరి యగుచున్ ?.

223


వ.

అంత నారాజకుమారికయు గర్భిణియైన నాలోన.

224


ఆ.

మంత్రిసుతుఁడు రాజమందిరంబున నొక్క
పగలు కపటవిప్రభామఁ జూచి
మోహి యగుచు నృపతి ముఖ్యున కెఱిఁగింప
నతని కిచ్చె నింతి నాలి గాఁగ.

225


క.

ఆమంత్రిసుతుఁడు కృత్రిమ
కామినిఁ గలయంగ బిలువఁ గల దొకవ్రతమో
భూమిసుర! తీర్ధయాత్రకు
బోమఱి యేతెంచి నన్ను బొందెద వనుడున్.

226


ఆ.

అతఁడు తీర్థయాత్ర యరిగినన దత్పూర్వ
పత్నిఁ బొందుచుండెఁ బగలురేలు
నంత మంత్రితనయుఁ డరుదెంచు టెఱిఁగి య
ప్పొలఁతి గొంచుపోయెఁ బురము వెడలి.

227


వ.

అంత నమ్మూలదేవుండను సిద్ధయోగి కపటశిష్యునిం దెచ్చి రాజునకుం జూపి మత్పుత్రిని నితనికి వివాహంబు సేయవలయు దెప్పించుమనిన భూపాలుండు.

228
  1. సూర్యోదయ అనుటలో ప్రాస చెడినది, “ సూరోదయ" అనుట బాగుగనుండును.