పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

43



పండుమామిడన్ని బ్రమిసె చిలకాలు
వజ్రములబాలయ్య వాకిటాడంగ
వట్టిమామిడన్ని వచ్చె చిలకాలు,

18
బుద్ధిగలవాడమ్మ చిన్ని నాయన్న
భుజాన వేసిరే భుజకంఠమాల
వాసిగలవాడమ్మ చిన్నినాయన్న
వాసియని వేసేరు వనమాలపేరు.

19
కాకర చెట్టుకు కాయలందమ్ము
బాలయ్య చెవులకు పోగులందమ్ము

20
తుమ్మెదనీకళ్ళు దూలాలమీద
బాలయ్యనీకళ్లు మగనాళ్ళమీద.

21
ఊరికి ఉయ్యాల అమ్మవచ్చింది
కొమాళ్ళుగలతల్లి కొనరెవుయ్యాల
కొడుకులుగన్న చేడె కొనరెవుయ్యాల
ఏమి పెట్టి కొందు వెండివుయ్యాల
చేటకొంగునచేరెడు ముత్యాలు పోసి
ఉయ్యాలనేకొందు వుయ్యగ కొందు
ఉయ్యాలచేరుల్లు వుత్తగదములు

22
చిరిదిండికాడమ్మ చిన్ని బాలమ్మ
పట్నానతేరమ్మ పుట్నాలగోనె,