పుట:సంప్రదాయ విజ్ఞానము.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

42



వాము బాలయ్యకు వోకార మన్ని
ఇక సర్వకాయమియ్య ఓ సఖియదేవి
సర్వకాయం మాబాలయ్యకు సంతోష మన్ని.

15
తంగేడుచెట్టుకే తూగుటుయ్యాల
ఉయ్యాలపట్టుక ఊగె బాలయ్య
తంగేడు చెట్టుకింద వంగి ఆడివచ్చె
హంసల్లు కోయిల్లు అవి లక్ష వేలు
చిలకాలు పావురాలు శివ ! లక్షవేలు
శ్రీరాముడుండంగ మనకేటి భయమె
హనుమంతు డుండగ మనకేటి భయమె.

16
ఓచిన్నికుమార ! నే కొందు నీకు
వుట్టుగజ్జలు కొందు పులిగోరుకొందు
పున్నయ్య మీనాన్న వచ్చె వూరుకుండు
కాళ్ళ గజ్జలుకొందు, కంటె, కమలాలు కొందు
కౌసల్య మీఅమ్మ వచ్చె యేడువకు
చీదర్లు చెయ్యకు చిన్ని బాలయ్య
చీదర్లు నినుబాసె సిరులు నిను బొందె
శ్రీలక్ష్మి ఊయంగ ఊగు ఉయ్యాల
ఉయ్యాల నీకమిరె వుగ్గు నీ కమిరె.

17
ముత్తెములబాలయ్య ముంగిటాడంగ
ముంతమామిడన్ని ముసిరె చిలకాలు
పగడములబాలయ్య పందిటాడంగ