Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశ లక్ష్యములను, కార్యవిధానమును మొదటి సంపుటము విశేషము లను సమితి కార్యదర్శిగారు తమ విపుల పీఠికలో చక్కగా వివరించి యున్నారు. సంపుటములో 328 పుట లాంధ్రదేశ ప్రశస్తి కంకితమగుట నాదృష్టిని ముఖ్యముగా నాకర్షించిన విషయము. ప్రాచీనార్వాచీన విజ్ఞాన జలములను ఆంధ్రులు నిరంత రము చేదుకొనుట కుపకరించు తరుగని మోటబావిగ ఈ కోశము వర్ధిల్లవలె నని కోరుచు ఆంధ్రావళి దీనిని హార్దికముగా నాదరించి ఆర్థికముగా పోషింపగలరని ఆశించుచున్నాను.


హైదరాబాద్

బెజవాడ గోపాలరెడ్డి

విలంబి, అధిక శ్రావణ బహుళ ౭ గురువారం

అధ్యక్షుడు,

7 ఆగష్టు 1958

సంగ్రహాంధ్ర విజ్ఞానకోశ సమితి.