Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/873

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆర్షభూగోళము అమరసింహుడు ' _హిమవాన్ నిషధో వింధ్యో మాల్యవాన్ పారియాత్రకః గంధమాదన మన్యేచ హేమ కూటాదయో నగాః—' అని జంబూద్వీపములోని కొన్ని పర్వతములను చెప్పినాడు. 1. హిమవంతము :- ఇది కింపురుషవర్షమునకు దక్షిణ మందు మేరయై యుండునది. 2. నిషధము :- ఇది హరివర్షమనెడు వర్షమునకు ఉత్తరమున బాలసూర్యప్రకాశమై యుండును. 3. వింధ్యము :- ఇది భారతవర్ష మందుండు కుల పర్వతము. 4. మాల్యవంతము :- ఇదియే క్రౌంచపర్వతము. ఇది మేరు పర్వతమునకు పడమట గంధమాదన సమప్రమా ణమై యుండును. 5. పారియాత్రకము :- ఇది భారతవర్షమం దున్నది. 6. గంధమాదనము :- ఇది మేరు పర్వతమునకు తూర్పున నున్నది. 7. హేమకూటము :- ఇది కింపురుష వర్షమునకు ఉత్తరముననున్నది, (ఇది లింగాభట్టు చేసిన వివరణము) జంబూద్వీపములో ఒక్కొక్క వర్షములోనేగాక నిరక్ష రేఖక్రింది ఆరు దీవులలోను దీవికి ఏడేసి కులపర్వతము లున్నవని వాయుపురాణము చెప్పినది. కులపర్వతము అనగా ప్రధాన పర్వతములని భావము. పర్వతమను పదమునకు సర్వత్ర ఉండునది, సంధులుగలది యనియు వ్యుత్ప త్తియున్నది. పర్వములు లేకపోయినచో వ్యుత్పత్తియున్నది. గిరియగును. అది పర్వతముకాదు. రెండు పర్వతముల నడుమనున్న నేల లోయ లేక కనుమ. సంస్కృతములో ఇదియే ద్రోణి. గిరి పగిలినచో ఆవగులును దరి యందురు. భారత వర్షములో నున్న మహేంద్ర మలయాది కుల పర్వతములకు లెక్క పెట్టలేనన్ని శాఖలున్నవి. ఇవి శాఖా పర్వతములు. మందరము, వైహారము, దుర్దురము, కోలాహలము, సురసము, మైనాకము, వైద్యుతము, పాఠంధమము, పాండురము, కృష్ణము, గంతుప్రస్థము, గోధనము, పుష్పగిరి, శ్రీ జయంతము, రైవతకము, కాకువు, కూటశిలము మున్నైనవి శాఖా పర్వతములు. ఈ కొండలలో ఆర్యమ్లేచ్ఛ జనపదము లున్నవని వాయు పురాణము తెలుపుచున్నది. 798 కులపర్వతముల పుత్తికలు :- త్రిసామ, ఋతుకుల్య, ఇక్షుల, త్రిదివ, లాంగూలిని, వంశధార అను నదులు మహేంద్రమను కులపర్వతము గన్న కూతుండ్రు. వంశ ధార మన మెఱిగినదే. వీనిలో కొన్ని నదులు నేడు లేవు. కొన్ని నదులు నామరూపములు లేకుండ పోవుట కలదు. త్రివేణిగా ప్రసిద్ధి చెందిన వానిలో సరస్వతి నేడు లేదు. నదులేమి ? అవి పుట్టిన పర్వతములే యొక్కొక యెడ మటుమాయమై పోయినవి. ఉత్తర సముద్రములో కొన్ని కొండలు మునిగిపోయినవని వాయు పురాణము వాకొనుచున్నది. కృతమాల, తామ్రపర్ణి, పుష్పజాతి, ఉత్పలావతి అను నవి మలయపర్వతమునుండి స్రవించిన యమృత వాహి నులు. వీనిలో తామ్రపర్ణి సుపరిచితము. ప్రసిద్ధమైన ఉదకమండలమే మలయపర్వతమని కొందరనుచున్నారు. సహ్యకుల పర్వత పుత్త్రికలైన గోదావరి, భీమరథి, కృష్ణవేణి, వంజుల, తుంగభద్ర, సుప్రయోగ, కావేరులు దక్షిణ భారతము నానంద నిలయము గావించినవి. ఋసీక, సుకుమారి, మందగ, కూసపలాణిని యను వాహినులు శుక్తిమత్కుల పర్వత సంతానము. ఋక్షకుల పర్వతము గన్న గారాబు బిడ్డలు శోణ, నర్మద, మందాకిని, దశార్ణ, చిత్రకూట, తమస, పిప్పల, శ్రోణి, కరతోయ, వైశాచిక, నీలోత్పల, విపాళ, జంబుల, శుక్తిమతి, మక్రుణ, త్రిదివ అనునవి. వింధ్యకులపర్వతము తాపి, పయోష్ఠి, నిర్వింధ్య, మద్ర, నిషధ, వేణ్య, వైతరణి, శితిబాహు, కుముద్వతి, తోయ, మహాగౌరి, దుర్గ, అంతళ్ళిల అను జలకన్యలను గన్నది. పారియాత్ర కులపర్వతమునుండి వేదస్మృతి, వేదవతి, వృత్రఘ్న, సింధు, వర్ణాస, చందన, సతీర, మహతి, పద, చర్మణ్వతి, విదిశ, వేత్రవతి, శివ, అవంతి, అను స్రవంతి సంతానముద్భవిల్లినది. ఇట్టి నదీమతల్లులకు పుట్టినిం డైన యీమహాపర్వతముఁ వయస్సెంత? ఇవి యెప్పటివి? వీనికి తావైనభూమి వయస్సు రెండువందల కోట్ల యేండ్లని భూతత్త్వవేత్తలు నుడువుచున్నారు. మన పురాణములు వై వస్వతమనువు 800 కోట్ల యేండ్ల వెనుకటి వాడని చెప్పినవి. ఈ వైవస్వత