ఆర్ష గణితము
ప్రాంతీయ సభలనుండి యెన్నుకొనబడిన ప్రతినిధులు సార్వదేశిక ఆర్యప్రతినిధిసభకు అధికారుల నెన్నుకొందురు. అందునను ఒక కార్యనిర్వాహక వర్గముండును.
ప్రతి ఆర్యసమాజమును సప్తాహమున కొక పర్యాయము సత్సంగ మను పేరిట సదస్యుల నెల్లరను సమావేశ పరుచును. ఆ సమావేశమున సంధ్య, అగ్నిహోత్రము, భగవద్భజనలు జరుపును. విద్వాంసుల ద్వారమున ధర్మోపదేశము చేయించును. విజ్ఞులమూలమున జ్ఞాన చర్చ జరిపి వైయక్తిక, సామాజిక జీవనౌన్నత్యమునకు పాటు పడుచుండును.
వార్షిక సమావేశముల సాయమున వైదిక ధర్మ ప్రబోధము నొనరింప శక్తి కొలది యత్నించును.
ఇట్టి యార్యసమాజములు భారత దేశమునం దంతటను అనేకము లేర్పడినవి. పంజాబు, ఉత్తరప్రదేశము, బీహారు మధ్యప్రదేశము మున్నగు ప్రాంతములలో ప్రాంతీయ ప్రతినిధిసభ లేర్పడి నిజధర్మమును నిర్వర్తించుచున్నవి.
విదేశములందు ఆఫ్రికా, ఇంగ్లండు, అమెరికా, బర్మా, అస్సాము మున్నగు దేశములందును ఆర్యసమాజములు నెలకొల్పబడినవి.
భారతదేశమున ఢిల్లీనగరమున నున్న సార్వదేశిక ఆర్యప్రతినిధిసభతో ఎల్ల దేశముల సమాజములకును సంబంధ మున్నది. భారతదేశమునుండి వెళ్ళి విద్వాంసులైన ధర్మప్రచారకులు విదేశములందు వైదిక ధర్మప్రచారము నొనర్చుచున్నారు.
ఆర్యసమాజము నడుపు సంస్థలు :- బాలురు, బాలికలు బ్రహచర్యపూర్వకముగ జాతీయపద్ధతులతో విద్యల సభ్య సింప ననువుగ ననేక సంస్థల నెలకొల్పి విద్యావ్యాప్తికి తోడ్పడుచున్నది. అందు గురుకులములు, దయానంద ఆంగ్ల వైదిక కళాశాలలు (D. A. V. Colleges) అతి ముఖ్యములు.
ఇవికాక అనాథ శరణాలయములు కూడ స్థాపించి వానిని నిర్వహించుచున్నది. దిక్కులేని పిల్లల నందు చేర్చి వారికి హస్తకళలతో పాటు విద్యాప్రదాన మొనర్చి స్వతంత్రులై జీవనోపాధి గడుపుకొనదగిన సామర్థ్యమును కలిగించుచున్నది.
వైదిక సాహిత్యమును ప్రచారముచేయు నుద్దేశముతో ముద్రణాలయములను నెలకొల్పి వేదాదిగ్రంథములను ముద్రించుచున్నది.
దేశ విదేశములందు వైదిక ధర్మముల నుద్బోధించుటకు యోగ్యులయిన ప్రచారకులను సిద్ధముచేయుట కనువగు ఉపదేశక విద్యాలయములను స్థాపించి నిర్వహించుచున్నది.
ఈ సంస్థలన్నియు నాయా ప్రాంతములందు ప్రాంతీయ ఆర్యప్రతినిధి సభల యధీనమున నడుచుచున్నవి. వీని నిర్వహణమునకు వలయు ధనము విశేషభాగము సమాజకోశమునుండియే వెచ్చింపబడును. విద్యాసంస్థల నిర్వ హించుటకు ప్రతి సంవత్సరమునందును సుమారు 25 లక్షల రూపాయలు వెచ్చింపబడు చున్నవి.
పం. గో.
ఆర్షగణితము :- ఛాందోగ్యోపనిషత్తునందు (vii. 1. 2) నారదముని సనత్కుమారునితో తానదివరకు నేర్చిన విద్యలను చెప్పుచు రాశివిద్యను, నక్షత్ర విద్యను పేర్కొ నెను రాశివిద్యయనగా గణితమనియు, నక్షత్రవిద్యయనగా జ్యోతిషమనియు అర్థము. ఆర్షసంప్రదాయమున తత్త్వజ్ఞానోపయ క్తములగు విద్యలు తక్క మిగిలిన విద్యలన్నియు తత్ప్రతిబంధకములుగా ఉపేక్షింప బడినవి. అయినను శ్రోతస్మార్త క్రియలకు అవసరమగు నంతమటుకు ప్రతి విద్యలోను పరిపూర్ణతను ఆయా శాస్త్రములు పొందియే యున్నవి. అట్టి షడంగములలో జ్యోతిషము మూర్ధన్యమని వేదాంగ జ్యోతిషము చెప్పును. అట్లే యాగములందు ప్రధానమగు అగ్ని వేదియొక్క నిర్మాణమును గూర్చి బ్రాహ్మణము లందును, కల్ప సూత్రములందును చెప్పుచు గణితమును అనేక విధములుగా ఉపయోగించిరి. ఇట్లు వైదిక ఋషులచే ఉపయుక్త మైన గణితమందలి కొన్ని విషయము లిచట పరిశీలింప బడును. ఇచట ఆర్ష గణితమనగా ఋషి ప్రోక్త గణిత మనియే అర్థము.
అంకగణితము (Arithmetic) :- ఒకటి మొదలు పరార్థమువరకుగల సంఖ్యలు వేదములో ననేక చోట్ల వాడ బడుట యేగాక కాఠక సంహితాదులలో * సంఖ్యలుగా
- . తై. సం. 4. 4. 11; కాఠక సం. 17. 10; మైత్రాయణీ సం. II 1.14; కపిషల సం. 26. 9.