Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/863

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆర్యసమాజము


ఫలముల ననుభవింపవలెను. జీవులకు వారు చేయు కర్మలకు తగిన ఫలముల నీశ్వరు డొసగును. అతడు పాపము లను క్షమింపడు. జీవు లొనరించు కర్మలకు ఉద్దిష్టఫలము వెంటనే లభించునను నియమము లేదు. కావున కొన్ని కర్మల ఫలము జీవులకు జన్మాంతరమున ననుభవింపవలసి వచ్చును. పూర్వజన్మకృత కర్మలలో నెయ్యవి ప్రస్తుత శరీరమున ననుభవింపనగునో యవి ప్రారబ్ధము లనియు, శేషించిన కర్మలు సంచితము లనియు, రాబోవు జన్మములలో ననుభవింప ననువుగ ప్రస్తుత జన్మమున జేయు కర్మలు ఆగామి కర్మ లనియు పేర్కొనబడును. మనుష్య జన్మమందు జీవుడు కర్మల నాచరింప స్వాతంత్య్రముగలిగి యుండును. అన్యజన్మలు భోగజన్మలు. పశుపక్ష్యాది జన్మలందు జీవులు కర్మల నాచరించుటలో స్వతంత్రులు కారు. కావున పుణ్య పాప విభజనము మానవుల కేకాని అన్యప్రాణుల కుండదు. అందువలన ధర్మాధర్మ ప్రవృత్తి నివృత్తులను బోధించి శాసించు శాస్త్రములు మానవుల కొరకే నిర్మింపబడినవి. ఈ విషయమును గుర్తించి ఫలాపేక్ష లేక శుభకర్మల నాచరించి యంతఃకరణమును పరిపూత మొనర్చుకొని ముక్తిసుఖమును బడయువారు, జన్మమరణ బంధనము పరాంత కాలముదనుక తప్పించు కొనువారు ధన్యులు.

III యజ్ఞములు :- ఆర్యసమాజము వేదవిహితములైన అగ్నిహోత్రము మొదలు అశ్వమేధ పర్యంతముగల యజ్ఞ ములు మానవులకు అనుషేయములుగ నెంచును. బ్రహ్మ యజ్ఞము (సంధ్యోపాసనాదులు). దైవయజ్ఞము (అగ్ని హోత్రము), పితృయజ్ఞము (మాతాపితరుల సేవ), మనుష్య యజ్ఞము (అతిథి సత్కారము), బలివైశ్వ దేవము (ఆశ్రిత ప్రాణుల కాహారాదుల నొసంగుట) అను పంచమహాయజ్ఞములు ఎల్లరకు కర్తవ్యములు.

వేదోక్తయజ్ఞములు హింసారహితములు. యజ్ఞము లందు పశు విశసనాదులను ఆర్యసమాజ మంగీకరింపదు, ఉవ్వట, సాయణ, మహీధరాదులచే రచియింపబడిన వేద భాష్యములు యజ్ఞములందు పశు హింసాదులను అంగీక రించును. అందువలన భాష్యము లార్షములు కావు. తాంత్రికుల ఆచారములచే ప్రభావితులై భాష్యకారులు వేదముల నట్లు వ్యాఖ్యానించిరని యీసమాజ మెంచును.

యజ్ఞ శబ్దము ధాత్వర్థమును పురస్కరించుకొని దేవ పూజనమును, సంగతిక రణముమ, దానమును బోధించును. అట్లే మేధశబ్దము పవిత్ర వాచక మేకాని హింసా వాచకము కాదు. అధ్వరము హింసావాచకము కాకపోగా హింసను నిషేధించుచున్నది. (ధ్వరతి హింసాకర్మ నధ్వ రతీ త్యధ్వరః) ధ్వరమనగా హింస. అదిలేనిది అధ్వరము. అనగా అహింసాత్మకమని భావము.


వేదములందు సర్వత్ర సర్వభూతహితమే కర్తవ్యముగా బోధింపబడినది. (మా హిగ్ ంసీ సర్వభూతాని.) ఏ భూతమును హింసింపకుము. "అఘ్న్యా గావః' గోవులు హింసింపదగినవి కావు." అను నిట్టి వేద విధులు లెక్కకు మిక్కిలిగా వేదములందు ఉపలబ్ధములగుచుండ యజ్ఞ వ్యాజమున పశువిశసనాది హింసలు వేదముల పేర జరుపుట బుద్ధి సంగతముకాదు. (వైదికీ హింసా హింసా న భవతి) ‘వై దిక హింస హింస కాదు.' అను నిట్టి వాక్యములు వేద విరుద్ధములగుటచే అప్రమాణములు. కావున గో మేధమునకు ఇంద్రియములను పవిత్రము చేసికొనుట, అశ్వ మేధమునకు రాష్ట్రమును పవిత్రముచేయుట మున్నగు నర్థములను గ్రహించుట యుక్తము, గావః . ఇంద్రియములు. అశ్వః - రాష్ట్రము. ఇట్టి శబ్దార్థములు బ్రాహ్మణ గ్రంథములందు జూడనగును.

IV వర్ణాశ్రమ వ్యవస్థ  : విశ్వమునగల మానవులెల్లరును ఒకేజాతికి చెందినవారు. మానవులలో వివిధజాతులు లేవు. కాని మానవసంఘము సర్వాంగీణాభివృద్ధి నొందుటకు తగినట్లు చతుర్వర్ణములుగ వ్యవహరింపబడుటను ఆర్యసమాజ మంగీకరించును. అనగా వేదమూలక వర్ణాశ్రమ వ్యవస్థను సమాజ మంగీకరించును. బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య, శూద్ర వ్యవహారము మానవసంఘమున జన్మప్రయుక్తము కాక గుణకర్మప్రయుక్తముగా నంగీకరించును. అందువలన బ్రాహ్మణత్వాదులు జాతులుకావు బ్రాహ్మణ, క్షత్రియాది శబ్దములు వర్ణబోధకములు. జాతి వాచకములు కావు.

ప్రస్తుతము భారత దేశము వ్యవహారమందున్న జాతి భేదములు అవిద్యాకల్పితములు. అందువలన నవి వేదవిహి తములనజనదు. మానవులందరు పర మేశ్వరునిబిడ్డలు. సర్వ ప్రాణులు పర మేశ్వరుని ప్రజ. పరమేశ్వరుడు ప్రజాపతి.