ఆరణ్యకములు
ఇవి యిట్లుంచి యింకను తెలియచేయ వలసిన ధర్మముల సంఖ్య 1180 మిగిలి యున్నవి. అవి యివ్వి :
1. స్వస్థవృత్తమునందు (ఆరోగ్యవంతుడు నిత్య జీవనమునందు) రాత్రిందివములయం దనుస రించవలసిన ధర్మములు ...40
2. షడృతువులందును అనుసరించవలసిన విశేష ధర్మములు. ...24
3. వేగధారణము, త్రివర్గసాధనము, మున్నుగా దృఢసత్వ సంపన్నమగు శరీరములో దీర్ఘ జీవితమును సుఖమయముగా గడపి, వేదోదితమగు మనుష్యానందమును సంపూర్ణముగ ననుభవింపగల సమర్ధతను ఇహఫల సాధనముగా భోధించు ధర్మములు ...950
4. స్వర్గసుఖ సాధన ధర్మములు ...34
5. అపవర్గానుభూతి హేతువులగు ధర్మములు ...56
6. శాశ్వత అజరామరానంద సందోహ దివ్య తనుత్వ సంసాధక ధర్మములు ..76
- మొత్తము ...1180
- పూర్వోక్తములు 331
- వెరశి మొత్తము...1511
ఇట్లు పదునై దువందల పదునొకండు ఆయుర్వేద ధర్మములు కలవు. ఇవన్నియు చరకము ప్రమాణముగా గలవి. ఈ ధర్మములను చరక సంహిత యందలి సూత్ర విమాన, శారీర, ఇంద్రియ స్థానములందును, చికిత్సా స్థానమునగల మొదటి యధ్యాయమునందును చూడనగును, చరక సంహితయందులేని ఆరోగ్య ధర్మములు మరెచ్చటను లేవు. పురాణములు మొదలగు ఇతరము లందు గల ఆయుర్ధర్మములు ఈ సూత్రముల ననుసరించియే సమకూర్పబడినవి.
“చికిత్సా వహ్ని వేశస్య స్వస్థాతురహితం ప్రతి.”
యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి నతత్క్వచిత్."
(చ. స.10.88)
స్వస్థ, ఆతుర, హితముగోరి అగ్ని వేశునిచే రచింపబడిన ఈ సంహితయందు ఏది చెప్పబడినదో అది అన్నింటను చెప్పబడి యుండును. ఇందు చెప్పబడని విషయము మరియెచ్చటను లభింపదు, అని యిట్లు ప్రతిజ్ఞ చేసి శ్రీ అగ్ని వేశుడి చరక సంహితను ముగించెను. అగ్ని వేశునిచే సమకూర్పబడిన యీ సంహితయే, చరక సంస్కృతమై చరకసంహిత యనబడుచున్నది. చరకసంహిత యను ఆయుర్వేద ధర్మ సర్వస్వము.
సాహిత్య సమాలోచనమునకును, విశేష విజ్ఞాన సముపార్జనమునకును, ప్రజ్ఞాన్వితులగు జిజ్ఞాసువులు సావధానులై అమూలాగ్ర మొక పర్యాయము చరకసంహితను పఠించి ఉభయలో కార్థ ఫలసిద్ధు లగుదురుగాత.
'ఆయుర్వేదో ఒమృతానామ్”
వే. తి. వేం· రా. స్వా
ఆరణ్యకములు :- వేదము మంత్రబ్రాహ్మణాత్మకము. ఆ బ్రాహ్మణముల యనుబంధము లారణ్యకములు. అథర్వబ్రాహ్మణమునకు దప్ప తక్కిన మూడు బ్రాహ్మణములకు నారణ్యక గ్రంథము కనబడుచున్నది. సామ బ్రాహ్మణమునకు దాని చివరనున్న శుక్రియ కాండమే ఆరణ్యక మనబడుచున్నది. అట్లే శుక్ల యజుశ్శాఖకు శతపథబ్రాహ్మణ అంతిమ కాండ మే ఆరణ్యకము. కఠ మైత్రాయణీయాది శాఖలకు ఆరణ్యకములేదు కౌషీత కారణ్యక మన్న పేరుమాత్ర మున్నదిగాని, ఆ గ్రంథము మృగ్యము. ఇంక తైత్తిరీయారణ్యకము, ఐతరేయారణ్యకము ననెడి రెంటి విషయము. తైత్తిరీయారణ్యకము తక్కిన అన్నిటి కంటెను ప్రాచీనము. “అరణ్యే ౽ధీయీరన్” అను నిందలి వాక్యమును బట్టి ఇది అరణ్యములో అధ్యయనము చేయదగినదని తెలియుచున్నది. కాని ఇందలి - సావిత్ర - నాచికేత చాతుర్హోత్ర వైశ్యసృజ - భాగములకు ఈ నియమములేదని పూరా చార్యుల మతము. ఇందలి పది ప్రపాఠకములలో కడపటి నారాయణోపనిషత్తు. మొదటి తొమ్మిదియు ప్రాచీనములు. ఈ ఆరణ్యకము యజ్ఞోపయోగిగా కనవచ్చినను జీవేశ్వర తత్త్వబోధకములైన ఉపనిషత్తులును, వివి విజ్ఞానదాయకములైన ఇతర విషయములు నిందు కన వనుట నిజము.
ఇందలి మొదటి ప్రపాఠకము 'ఆరుణ కేతుకము' అనబడును. దీనినే, అరుణమందురు. ఆరోగ్య కాములగు వారు ఇందలి మంత్రములు పఠించుచు సూర్యనమస్కారము లొనర్చెడి యాచారము నేటికిని భరతఖండమంత