ఆయుర్వేద ధర్మములు
బలినొసగుచోటను, శుభకార్యములు జరుగుచున్నపుడును, ఉమియుట, చీదుట తగదు.
123. (1) "న స్త్రీయ మవజానీత." అతివను అవమానింపరాదు.
- (2) "నాతివిస్రంథ యేత్." అతి చనువు చూపరాదు.
- (3) "న గుహ్య మనుశ్రావయేత్." దాచతగిన రహస్యములు స్త్రీలకు వినిపించరాదు,
- (4) " నాధికు ర్యాత్.” ఆమెకు సర్వాధికారము ఒసంగరాదు.
- (5) “న రజస్వలాం" రజస్వలయైనట్టియు
- (6) “నాతురాం" వ్యాధిబాధితురాలగునట్టియు
- (7) “నా మేధ్యాం” అపరిశుభ్రతగలిగినట్టియు
- (8) “నాశస్తాం” యోగ్యురాలు కానట్టియు
- (9) " నానిష్ట రూపాచారోపచారాం" అనాకారియు సహింపరాని నడవడిగలట్టిదియు, ఇష్టములేని పరిచర్య చేయునట్టిదియు అను ఈ లక్షణములు గలిగినట్టియు,
- (10) “నాదక్షాం.” తన శక్తిసామర్థ్యములకు తగనట్టియు,
- (11) ‘“నాదక్షిణాం” తన కనుకూలవతి కానట్టియు
- (12) “నా కామాం” తనయందు ప్రీతిలేనట్టియు
- (13) “నాన్యకామాం” ఇతరుని ప్రేమించినట్టియు
- (14) “నాన్యస్త్రీయం” ఇతరుని వశమునందున్నట్టియు
- (15) “నాన్య యోనిం" తన జాతికి భిన్నమగుజాతి కలిగినట్టియు స్త్రీని
- (16) “నాయోనౌ” యోనిగాని ప్రదేశమందును
- (17) “నచై త్య చత్వర చతుష్పథో పవన శ్మశానాఘాత సవితౌషధి ద్విజ గురు సురాలయేషు." ధర్మ,శాలలు, రచ్చపట్టులు, పురోపపనములు, శ్మశానము, వధ్యస్థానము, నీళ్ళగది, ఓషధులు భద్రపరచిన ప్రదేశము, బ్రాహ్మణగురు గృహములు, దేవాలయము, అను నిటిస్థలములందును
- (18) "న సంధ్యయోః." (19) “నాతిథిషు.” సంధ్యా సమయమందును, నిషిద్ధములుగు తిథులయందును (సురతమునకు నిషేధించిన తిథులని భావము.)
- (20) “నాశుచిః." తాను శుభ్రముగా నుండకయు
- (21) “నాజగ్ధ భేషజః.” బలకరములగు ఔషధములను సేవింపకయు
- (22) “నాప్రణీతసంకల్పః." మనసునం దిచ్ఛలేకయు
- (23) “నా నుపస్థిత ప్రహర్షః." సంతోషము లేకయు
- (24) "నాభుక్తవాన్" భుజింపకయు
- (25) “నాత్యాళితః" అతిగ భుజించియు
- (26) “న విషమస్థః.” వ్యత్యస్తముగ నుండియు
- (27) "న మూత్రోచ్చార పీడితః.” మూత్రము నిరోధించియు
- (28) “నశ్రమ వ్యాయా మోపవాసక్షమాభిహతః." శ్రమచెందియు, సాముచేత, ఉపవాసముచేత బడలిక చెందియు
- (29) “నారహని వ్యవాయం గచ్ఛేత్." చాటు లేని తావులందును స్త్రీ సంభోగము చేయరాదు.
ఇట్లు మంచి నడవడికను (సద్వృత్తమును) గురించి చెప్పబడిన ప్రధాన ధర్మసూత్రములందు సూట యిరువది మూడు ధర్మములు మాత్రమే యిచట చూపబడినవి. ఈ సూత్రములలో సూ. 112 నందు 25, సూ. 116 నందు 4, సూ. 118 యందు 2, సూ. 122 నందు 2, సూ. 123 నందు 28, ప్రధాన ధర్మ గర్భితములగు మరికొన్ని విశేషధర్మములు వివరింపబడినవి, ఇందు 112వ ధర్మమున మంచి నడవడి కలవాడు భుజింప తగని అన్నవిశేషములును, 116 నందు వరి, జొన్న, మొక్కజొన్న మొదలగువాటి పేలాలపిండిని ఉపయోగింపవలసిన విధులు, 118 యందు శరీరమును వంకర టింకరగా నుంచి చేయతగని పనులు, 122 నందు ఉమియుటకు, చీదుటకు తగని ప్రదేశములు, 123 నందు అతివలయెడ వర్తింపవలసిన విధినిషేధములు చెప్పబడినవి. ఇట్లు' సూత్రగర్భితములైన ధర్మములు 61 కలవు; ఇవియు మూలధర్మములును కలసి 184 అయినవి. ఇవిగాక యీ సద్వర్తనమున తెలియదగిన ధర్మము లింకను 147 కలవు. ఇవన్నియు చేరిన మొత్తము సద్వర్తనమునందు మూడువందల ముప్పది యొకటిగా ధర్మములు నిరూపించబడినవి.