Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/834

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆయుర్వేద ధర్మములు


34. "ధార్మికః." సత్కార్యములను మాత్రమే చేయువాడుగా నుండవలయును.

35. “ఆస్తికః." వేదవిహిత నిష్ఠలయందు నమ్మకము కలవాడై యుండవలయును.

36. “వినయ బుద్ధి విద్యాభిజన వయోవృద్ధి సిద్ధా చార్యాణా ముపాసితా." వినయము, వివేకము, విద్యా వైభవము, కులీనత, వయః పరిణతి, ఆత్మసిద్ధిగలవారిని, శాస్త్రమంత్రోపదేశకు లగు ఆచార్యులను ఆరాధించువాడుగా నుండవలయును.

37. "ఛత్రీ." గొడుగు,

38. "దండీ.” కట్టి,

39. "మౌళీ." తలగుడ్డ, (టోపి)

40. “సోపానత్కః." పాదరక్షలు కలవాడై .

41. "యుగమాత్రదృగ్విచరేత్.” రెండు బారల దూరము (4 గజములు) ముందుచూపు కలిగి సంచరించు చుండ వలయును.

42. "మంగళాచారశీలః . ” పవిత్రమగు నడవడికయు, స్వభావమును కలిగియుండవలెను.

43. "కుచేలాస్థి కంట కామేధ్య కేశ తుషోత్కర భస్మ కపాలస్నాన భూమీనాం పరిహర్తా." చింపిపీలికలు, ఎముకలు, ముండ్లు, మలమూత్రములు, వెండ్రుకలు, వరిపొట్టు, బూడిద, కుండ పెంకులుగల ప్రదేశములను స్నానము చేసిన నీరు ప్రవహించుప్రదేశములందును సంచరించరాదు.

44. "ప్రాక్ శ్రమాత్ వ్యాయామవర్జీ స్యాత్.” బడలిక కలుగు వరకును వ్యాయామము చేయరాదు.

45. "సర్వప్రాణిషు బంధుభూత స్స్యాత్." సమస్త ప్రాణులయందును బంధు ప్రేమ కలిగి యుండవలయును.

46. క్రుద్ధానా మనునేతా." కోపము చెందిన వారిని మంచిమాటలతో అనునయించవలయును.

47. "ఖీతానా మాశ్వాసయితా." భయపడిన వారిని ఊరడించువాడుగా నుండవలయును.

48. “దీనానా మభ్యువపత్తా. దీనులు (చెడిన స్థితి గలవారు) అగువారిని ఉద్ధరించి స్వస్థులగునట్లు జేయువాడుగా నుండవలయును.

49. "సత్యసంధః." చెప్పినమాటను నిలబెట్టుకొను దీక్షగలవాడై యుండవలయును.

50. "సామప్రధానః" మంచితనము గలవాడుగా నుండవలయును.

51. "పరపురుష వచన సహిష్ణుః." ఇతరుల దుడుకు మాటలను ఓర్మితో సహింపవలెను.

52. "అమర్షఘ్నః" అసహన గుణము పోగొట్ట వలయును.

53. "ప్రశమగుణ దర్శి." శాంతి శమదమాది గుణములు కలిగి యుండవలయు.

54. "రాగద్వేష హేతూనాం హన్తా.” ఇచ్ఛాద్వేషములను కలుగజేయు కారణములను విడచి వేయ వలయును.

55. “నానృతం బ్రూయాత్." అబద్ధము చెప్పరాదు.

56. “ నాన్యస్వ మాదదీత." ఇతరుల ద్రవ్యమును అప హరింపరాదు.

57. "వాన్యస్త్రీయ మఖిల షేత్.” పర స్త్రీలను కోరరాదు,

58. "నాన్యశ్రియం." ఇతరుల సంపద కోర తగదు.

59. “న వైరం రోచయేత్." ఇతరులతో ద్వేషము నభిలషింపరాదు.

60. “న కుర్యా త్పాపం." చెడుపనులు చేయరాదు.

61. “న పాపే౽పి పాపీ స్యాత్." అపకృతి చేసిన వారి యందైనను తిరిగి అపకారము చేయు తలవుంచరాదు. . 62. "నాన్యదోషాన్ బ్రూయాత్." ఇతరుల తప్పులను బయలు పెట్టరాదు.

63. "నాన్యరహస్య మాగమయేత్." ఇతరుల రహస్యములను వెల్లడిచేయరాదు.

64. “నాధార్మికై ర్న నరేంద్రద్విపై స్సహాసీత." దుష్టప్రవర్తన గలవారితోను, రాజద్రోహులతోను కలసి యుండరాదు.

65. “నోన్మత్తెః న పతితై ః న భ్రూణహ స్తృభిఃనక్షు డ్రై ః నదుష్తైః పిచ్చివారు, కులభ్రష్టులు, గర్భపాతకులు,.నీచులు, చెడ్డవర్తనగలవారలతో కూడియుండరాదు.

..

65. "న దుష్టయానా వ్యారోహేత్." పొగరుపట్టిన వాహనములపై ఎక్కరాదు. .