ఆఫ్రికా ఖండపు భాషలు
ఈ క్రింది భాషలు హెమిటిక్ వర్గములో ముఖ్యమైనవి:- బెర్బర్ (ఆల్జీరియా+మొరాకో): హౌసా (Housa) (పశ్చిమ ఆఫ్రికా); తమాషెక్ (సహారాలోని టౌరగ్); గల్లా, సోమలి, దనకిల్ (Danakil) (ఉత్తర ఆఫ్రికా); నిలోటిక్. సీగ్రోలు, తూర్పు ఆఫ్రికాలోని పశు పాలకులు మాటాడు భాషలు దిన్కా, షిల్లక్, నూయర్ మొదలైనవి.
ఇవి ఈ క్రింద పేర్కొన బడిన మూడు ప్రధాన విభాగములుగా చేయబడినవి :- (1) తూర్పు హెమిటిక్ భాషలు (తూర్పు ఆఫ్రికా) (2) నిలోటో హెమిటిక్ భాషలు. (3) పశ్చిమ హెమిటిక్ భాషలు.
హెమిటిక్ భాషలు యీ క్రింది విశిష్ట లక్షణములు కలిగియున్నవి :- (1) వ్యాకరణ లింగము కల్గియుండుట ఉ౹౹ స్కిల్ (Schilb) బాష: 'ఓల్-డియా'=మగ కుక్క; 'ఎన్_డియా'= ఆడ కుక్క. నామా (Nama) భాష:'యా'=వాడు; 'టా' = ఆమె.
(2) బహువచన నిర్మాణములో వైవిధ్యము : ఉ॥ హౌసా (Housa) భాష: 'కున్నా' (=వ్రేలిగోరు); బహు వచన రూపములు; 'కున్నోబీ', 'కుమ్బువా', 'కునై బై'.
(3) లోపలి అచ్చులో మార్పు. షీల్డ్స్ (Shilh) భాష :- 'ఇలివి' (= ముల్లు); 'ఇలాన్ - ఆన్' (= ముండ్లు); 'ఆ-ఫులు* (= దారము), 'ఇ- ఫెల్-ఎన్' (= దారములు).
(4) బంటువర్గములో వలెనే షష్ఠీ విభక్తి రూపము నామవాచకమునకు తర్వాత వచ్చును.
బంటు మరియు సుడానిక్ వర్గములకు మిక్కిలి దగ్గర సంబంధము కలదు, వర్గ ప్రత్యయములే కాక, వ్యుత్పత్తి, పద ధాతువులు కూడ చాలవరకు సమానములుగా నున్నవి. రూపభేదముల నేర్పరచు 'మూలములు' ఈ రెండు వర్గములకు చాలవరకు ఒకటిగానే యున్నవి. ఒకే భాష మూలమునుండి ఇవి బయలు దేరినట్లు కనబడు చున్నది. బంటువర్గములోని ఫుల్ ఫ్ఫుల్డ్ (Fulfulde) భాషలోను, కొన్ని సుడానిక్ భాషలలోను గల నామవాచకముల వర్గ విభాగము కూడ ఇవి ఒకేభాష మూలముగా గలవని సూచించు చున్నవి.
అత్యధిక సంఖ్యాకములై యుండుటచే ఈ భాషలలో కొన్ని ముఖ్యభాషలు వర్తకము మొ॥ వాని కొరకు సామాన్య భాషలుగా అంగీకరింపబడియున్నవి. 1. బంటు వర్గములోని ఉంబందు (Umbundu) పోర్చుగీస్ పశ్చిమ ఆఫ్రికాలో (ఆంగోల్ లో) ఉపయోగించుచున్నది.
2. స్వాహిలీ (Swahilli) :- తూర్పు ఆఫ్రికాలో ఉపయోగించుచున్నది. బంటు, అరబిక్ భాషలకలయిక చే ఈ భాష ఏర్పడినది.
3. హౌసా (Housa) :- పశ్చిమాఫ్రికాలో 'సిరాలి యోన్' (Sierraleone) నుండి 'చాడ్' సరస్సువరకును ఉపయోగింప బడుచున్నది.
ఈనాడు ఆఫ్రికాలో విద్యావ్యాప్తికి ఈ దిగువ సమస్యలు పరిష్కరింప బడవలసినవిగా ఉన్నవి :- 1, ఆఫ్రికాభాష లన్నింటిలోను గల ధ్వనులను ప్రదర్శింప గల ఒక ధ్వనిమీద ఆధారపడిన లిపిని సృష్టించుట. 2. అధిక సంఖ్యాకములుగా మాటాడబడెడి భాషలకు బదులుగా కొన్ని ప్రధాన మూలభాషలను స్వీకరించుట.
లిపి :- లిపి విషయములో ఆఫ్రికా భాషలు వెనుకబడియున్నవి. వానిలో పెక్కింటికి ముఖ్యముగా నీగ్రోభాషలకు - లిపిలేదు. నేటి ధ్వన్యనుకరణ వర్ణములు, లిపి, యూరప్ ఖండ పండితుల సృష్టియై యున్నది.
ప్రాచీనకాలము నాటివియును, ఆధునిక కాలమునాటివి యును అగు ఆఫ్రికా లిపులు ఈ దిగువ విధములుగా నున్నవి:- 1. ఈజిప్టు దేశపు హెయిరో గ్లిఫిక్స్ లేక పద చిత్రములు. 2, కాప్టిక్ (Coptic) లిపి. ఇది గ్రీక్ ఈజిప్టు భాషలలోని వర్ణముల మిశ్రమము. క్రీ. శ. 200. 400 నాటి ప్రాచీన మత గ్రంథములలో ఇది ఉపయోగింపబడెను. 3. లిబియా శాసనలిపి. 4. టిఫినాఫ్ (Tifinagh): టుఆరెగ్ (Tuareg సహారా)లో మాటాడబడు 'తమా షేక్ ' యొక్క లిపి ఇది. (5) ఆమ్హ హారిక్ లిపి ప్రాచీన సెమిటిక్ భాషయగు ఇది మధ్య అబిసీనియాలో ఆమ్ హరావద్ద రాజభాషగా క్రీ. శ. 1300 ప్రాంతము వాడబడుచుం డెడిది. (6) అరబిక్ :- ఈజిప్టులో భాషయై ఇది ఉత్తర ఆఫ్రికాలో చాలచోట్ల వాడ బడ చున్నది. (7) వై (Vai) నై బీరియాలోని ఒక నీగ్రోలియిది. 'డోలుబు కేరీ' (Doalu bukeri) (మరణము 1850) దీనిని సృష్టించెను.