Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/801

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆపస్తంబుడు


'ఈ భారత దేశమున పుట్టిన బ్రాహ్మణుని సమక్షమున భూమియందలి సర్వమానవులు తమ తమ ఆచారములను అభ్యసించవలయును. నిర్ణీతార్య మర్యాదలు గలదై, ఆచరిత వర్ణాశ్రమ స్థితిగలదై వేదత్రయ రక్షితమగు ధర్మముచే రక్షింపబడు దేశము ఉపద్రవ రహితమై శాంతి యుతముగా మనగలదు' అని మనువు వచించెను. ఇట్టి మర్యాదలను (వ్యవస్థలను) ప్రతిపాదించిన మహర్షులలో ఆపస్తంబ మహర్షి అగ్రగణ్యుడు.

ఆపస్తంబుని సూత్రములు విశేషముగా పాటించువారు ఆంధ్రులై యున్నారు. ఆంధ్ర కవులలో పెక్కురు ఆపస్తంబ సూత్రులు కలరు. కాబట్టి ఆపస్తంబుడు ఆంధ్ర జాతీయుడని తోచుచున్నది. ఇయ్యంశమును గార్బు, బహ్లరు, పండితులు మున్నగు విమర్శకులును బలపరచిరి. ఈ విషయమును మరియొక విధముగా గూడ స్థాపింప వచ్చును. విశ్వామిత్రుని సంతతివారై అతనిచే శప్తులయిన వారలలో ఆంధ్రులుకూడ నున్నారు. శునశ్శేపుని కథ జరుగునప్పటికి విశ్వామిత్రుడు పుష్కర క్షేత్ర సామీప్యమున తపస్సు చేయుచుండినట్లు శ్రీమద్రామాయణ గ్రంథమువలన విదితమగు చున్నది. పుష్కర క్షేత్రమునకు సమీపముననే సాల్వదేశముకలదు. ఆపస్తంబుడు సీమంతో న్నయన విధియందు సాల్వదేశమును, యమునా నదిని, యౌగంధరి యను ఆ దేశపు రాజును గూర్చి గానము చేయదగు నని ప్రత్యేకముగ చెప్పియుండుటచే అతనికి సాల్వ దేశము నందును తత్రత్యు లయిన జనుల యందునుగల ప్రత్యేకాభిమానము తేటపడుచున్నది. ఆంధ్రగణమువారు ఇక్కాలమున సాల్వదేశ ప్రాంతమున నుండుటచే ఆపస్తంబుడు ఆంధ్రజాతీయుడై నట్లు ఊహించుట సమంజసము.

ఆపస్తంబుడు ప్రాచీన మహర్షియై యున్నట్లు నిరూపించుటకు పెక్కు సాధనములు కలవు. బోధాయన సూత్ర గ్రంథములో ఆపస్తంబుడు గోత్ర ప్రవర్తకులలో నొకడుగా పేర్కొనబడెను. పరాశర యాజ్ఞవల్క్యులు తమ ధర్మశాస్త్రములలో ఆపస్తంబుని ధర్మశాస్త్ర ప్రవర్తకునిగా పరిగణించిరి. పాణిన్యాచార్యుడు 'అనృష్యానన్తరే బిదాదిభ్యో ౽జన్ (4.1.104) అను సూత్రమున బిదాది గణములో ఆపస్తంబ శబ్దమును పఠించెను. అందుచే ఆపస్తంబుడు పాణినికి పూర్వుడని నిరూపితమగుచున్నది.

ఆప స్తంబుని గృహ్య సూత్రములలో పాణినీయ వ్యాకరణమునకు విరోధముగల ప్రయోగములు కలవు. ఉదా :-ఆరోహతీం (5 -24); తరతీం (6-2); పుం స్వాః (6-4); గృముష్టిః (20-11); అభ్యానాయన్ (12-7); త్రిస్సైప్త ః (9-5) ; ప్రష్పం (11-2); కుప్త్వాం (23-7) మున్నగునవి. కొన్ని విభక్తి వ్యత్యయములుకూడ కనవచ్చు చున్నవి. ఉదా :- తస్యైవపా (22-4) ; అధ్యా౽ స్యై దక్షిణేన (1-5): ఇయ్యంశములు కూడ అపస్తంబుడు పాణినికి పూర్వుడను విషయమును బలపరచు చున్నవి. ఆపస్తంబుడు నిరుక్త కారుడయిన యాస్కుని, జ్యౌతిషకర్త యగు లగదుని తన ధర్మసూత్రములో పేర్కొనియున్నాడు. అందుచే ఇతడు యాస్కలగదులు కనంత రీయుడని ఊహింపవచ్చును. పాణిని క్రీ. పూ. 600-300 సం. ల కాలమునకు చెందిన వాడనియు, యాస్కుడు క్రీ. పూ. 800-500 ల కాలమునకు చెందిన వాడనియు పి. వి కాణేమున్నగు పండితులు వ్రాసిరి. అందుచే ఆపస్తంబుడు క్రీ.పూ. 800-600 లకు మధ్యనున్న వాడనుట సమంజసము.

మహర్షులచే ప్రతిపాదితములైన మర్యాదలు విధి. నియమ - నిషేధ రూపములచే మూడు విధములు. అందు ప్రవృత్తి ప్రయోజనకము విధి. నిషేధ, నియమములు నివృత్తి ప్రయోజనకములు. (1) విధి - 'సంధ్యోశ్చ బహిర్గామాదాసనం వాగ్యతశ్చ (1 ప్రశ్న 30 పటల, 8 సూ అను నాప స్తంబ ధర్మసూత్రమునుబట్టి సంధ్యోపాసనా కాలమున గ్రామమునకు వెలుపల నుండుట, వాజ్నియ మము కలిగియుండుట అనునవి విధులు. ఇచట ప్రవృత్తి ప్రయోజనము వివక్షితమైనది (2) ప్రాఙ్ముఖో ౽ న్నాని భుంజీత (1.31.1) అను సూత్రముచే ప్రాఙ్ముఖుడయి భోజనము చేయవలయు నని చెప్పుట వే అన్యదిగా! ముఖ్యము నిషిద్ధమైనది. ఇది నిషేధ ప్రయోజనక విధియై యున్నది. (3) "యాజనాధ్యావన ప్రతిగ్రసై రేవ బ్రాహ్మణో ద్రవ్య మార్జయేత్" యజ్జము చేయించుట, వేదమును చదివించుట, ప్రతిగ్రహణము- అనువాటిచేతనే బ్రాహ్మణుడు ద్రవ్యము నార్జింపవలయును అనునది నియమము. ఇట్టి నియమమున వృత్త్యంతరములచే య థేష్టముగా బ్రాహ్మణునకు ద్రవ్యార్జనము నిషిద్ధమగుచున్నది. ఇట్లు పూర్వోక్తము లయి